మొబైల్ కవర్ వేయడం వల్ల హీటింగ్ సమస్యలు తలెత్తుతాయని ముఖ్యంగా వేసవికాలంలో మొబైల్ కవర్ ఉంటే మొబైల్ చాలా వేడెక్కుతుందని ఇలా వేడెక్కినప్పుడు అది స్ట్రక్ అయ్యే అవకాశం లేదా స్లోగా వర్కింగ్ అవుతుందని తెలుపుతున్నారు.
అయితే కొంతమంది నిపుణులు తెలిపిన ప్రకారం మొబైల్ యొక్క కవర్ చార్జింగ్ పెట్టిన సమయంలో చాలా ఇబ్బందులను కలిగిస్తాయట. ఫోన్ కవర్ల కారణంగా మొబైల్ హీట్ ఎక్కడంతో పాటు సరిగ్గా చార్జ్ అవ్వదు అని కూడా తెలుపుతున్నారు.
మొబైల్ కి నాణ్యతమైన కవరు వేయకపోతే బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల మన శరీరానికి చాలా ఇబ్బందులకు గురయ్యేలా చేస్తాయి.. మొబైల్ పౌచ్లకు అయస్కాంతం ఉంటే.. అది మొబైల్ యొక్క gps సమస్యలను సైతం కలిగిస్తుంది.
ఈమధ్య చాలా కంపెనీలు సైతం మొబైల్ బ్యాక్ సైడ్ సరికొత్త డిజైన్లతో బ్యాక్ ప్యానెల్ ని విడుదల చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మనం బ్యాక్ పౌచ్ ఉపయోగిస్తే కచ్చితంగా మొబైల్ కి ఉండే కలర్ పోతుందట.
మొబైల్ గ్లాస్ పైన గొరిల్లా గ్లాస్.. కెమెరా లెన్స్ పైన అదనపు గ్లాసులు వేయించుకోవడం మంచిదే.. అయితే గొరిల్లా గ్లాస్ ను కనీసం 6 నెలలకు ఒకసారి అయినా మారుస్తూ ఉండాలట. లేకుంటే మీ మొబైల్ కి ఆ గ్లాస్ అలాగే అతుక్కుపోయి అవకాశం ఉంటుంది.