కెనటిక్ లూనా ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1970లో ఈ బైక్ ఒక ట్రెండీ బైక్ గా మారిపోయింది. ఎవరైనా సరే ఎక్కువగా లూనా బండిని కొంటూ ఉండేవారు.. పెట్రోల్ తో నడిచే ఈ వాహనం అతి తక్కువ కాలంలోనే ఉత్పత్తిని నిలిపివేశారు.. కానీ ఇప్పుడు మళ్లీ లూనా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా ఎలక్ట్రిక్ బైకు గా లాంచ్ చేయబోతున్నారు.. కెనటిక్ గ్రీన్ కంపెనీ ఓల్డ్ లూనా కేస్ లేటెస్ట్ గా పలు రకాల అప్డేట్లతో..E -LUNA గా E-2 W గా వచ్చే నెలలో ప్రారంభం చేయబోతోంది.

ఈ లూనా బైక్ కి సంబంధించి జనవరి 26 నుంచి బైక్స్ బుకింగ్ ప్రారంభం కాబోతున్నాయి. కేవలం కేనటిక్ వెబ్సైట్లో రూ .500 రూపాయలు బుక్ చేసి మరి ఈ బైకు తీసుకోవచ్చు.. మరో ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ లిఫ్టింగ్ లో కూడా బుక్ చేసుకోవచ్చట. కెనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు అయిన సీఈవో సులజ్జ పిరోడియా మోత్వాన్ని మాట్లాడుతూ ఈ బైక్ సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో తిరిగి పురాగారణం చేస్తున్నామంటూ ప్రకటించారు.


ఇలా చేయడం తాను చాలా సంతోషంగా ఉందని .. ఈ లూనాను ఈయేడాది ఫిబ్రవరిలోని ప్రారంభించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26 నుంచి బుకింగ్ ప్రారంభించామంటూ తెలిపారు.. మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ ఇండియా అనే విధంగా ఈ బైక్ ని ప్రకటించారు.. మెట్రో టైర్-1 పట్టణాలలోనే కాకుండా వివిధ గ్రామీణ నగరాలలో ఇండియాలో ఉండేటువంటి మార్కెట్ల కోసమే వినియోగదారుల రహదారి పరిస్థితిలకు అనుగుణంగానే డ్రైవింగ్ విషయంలో కూడా చాలా అనుగుణంగానే ఈ లూనా బండి దృఢమైన మన్నికమైన విధంగా రూపొందించబడింది అంటు తెలిపారు. ప్రతినెల 5 వేల యూనిట్లను తయారు చేస్తానని ప్రస్తుతం దీని ధర  రూ.74 వేల రూపాయలు ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: