దేశీయ మార్కెట్లో ప్రస్తుతం విస్తృతంగా ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ కలదు.. రోజు రోజుకి ఈ డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో వాటి అభివృద్ధి సాధ్యం కాలేకపోతున్నాయి. ముఖ్యంగా వీటి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది ప్రజలు కొనడానికి భయపడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే అతి తక్కువ బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. సరిగ్గా ఈ విషయం పైన ఫోకస్ పెట్టి చౌకైన ధరకు మంచి ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది మోటోవోల్డ్ అర్బన్ ఈ బైక్..


బైక్ ఒక్కసారి సింగిల్ ఛార్జింగ్ చేస్తే ఏకంగా 120 కిలోమీటర్ల వరకు పయనిస్తుంది. చూడడానికి ఈ బైక్ చాలా స్టైలిష్ గా ఉన్నప్పటికీ రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది. ఈ బైకు యొక్క పూర్తి విషయానికి వస్తే.. ధర రూ.49,999 రూపాయల వద్ద (ఎక్స్ షోరూం ) అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం మార్కెట్లో ఈ బైక్ రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తోంది. ఈ బైకు 5 రంగులలో కూడా అందుబాటులో ఉన్నాయి.


మోటోవోల్డ్ అర్బన్ ఈ బైక్ ఎలా నడిపిన కూడా అదిరిపోయే సస్పెన్స్ తో ఉంటుంది. ఈ బైక్ చాలా కొత్త రకం బైక్.. బ్యాటరీ విషయానికి వస్తే కేవలం నాలుగు గంటలలోనే పూర్తిగా చార్జింగ్ అవుతుంది. రహదారి పైన 25 MPH  వేగంతో పయనిస్తుంది..BLDC మోటార్ అధిక శక్తిని సైతం అందిస్తుంది ఇది రైడ్ ని చాలా సున్నితంగా చేస్తుంది..36V/20AH బ్యాటరీ గా అందుబాటులో ఉన్నది. ఈ బైకు కేవలం 40 కిలోలు మాత్రమే ఉంటుంది. అర్బన్ ఎల్ఈడి ఇన్స్ట్రుమేషన్ తోపాటు.. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా కలవు. టైర్లకు డిస్క్ బ్రేకులు కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ బైక్ నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు నిబంధనల ప్రకారం 16 నుంచి 18 వయసు కలిగిన వారు ఈ బైకు ని నడపవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: