మనలో చాలామంది చిన్న వయసులోనే బట్టతల వచ్చిన వారు ఉన్నారు.. అయితే ఇలాంటివారు ఎన్ని ప్రయత్నాలు చేసినా తల మీద వెంట్రుకలు మొలవడానికి పలు రకాల ట్రీట్మెంట్లు నాటు పద్ధతులను సైతం ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా జనాలు బట్టతల పైన జుట్టు మొలవడానికి ఎన్నో తంటాలు పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉన్న జుట్టుని రాలిపోకుండా ఉండడానికి మార్కెట్లో దొరికేటువంటి నూనెలను సైతం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో కొంత మంది విగ్గులను సైతం ఎక్కువగా బట్టతలను దాచడానికి ఉపయోగిస్తూ ఉంటారు.


అయితే ఇక మీదట తలపై జుట్టు కోసం ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.. కేవలం పైన కనిపిస్తున్న హెల్మెట్ల కనిపించే ఈ పరికరాన్ని సైతం తలకు తగిలించుకుంటే చాలు ఆరు నెలలలోనే గట్టి ఫలితాన్ని సైతం చూపిస్తుందట.. ఆస్ట్రియాకు చెందిన నియో స్టేమ్ కంపెనీకి చెందిన ఈ పరికరాన్ని తయారు చేశారు. హెయిర్ లాస్ ప్రివెన్షన్  వేయిరాబుల్ పేరుతో మార్కెట్లోకి ఈ పరికరాన్ని విడుదల చేయడం జరిగింది. ప్రతిరోజు కనీసం ఒక అరగంట సేపు దీనిని తల మీద తొడుక్కున్నట్లు అయితే బట్టతల నుంచి విముక్తి పొందవచ్చు.


అది ఎలా అంటే తల పైన ఉన్న మూల కణాలను ఉత్తేజితం చేసి జుట్టు రాలిపోయిన చోట తిరిగి జుట్టును సైతం మొలిపించే విధంగా ఈ మిషన్ తయారు చేస్తుందట. దీని వాడకం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు కూడా ఉండవని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది కొంతమంది మీద పరిశోధన చేసిన తర్వాతే మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ఆయా కంపెనీ సంస్థలు తెలియజేస్తున్నాయి. ఇప్పటివరకు పరిశోధన చేసిన వాటిలో సక్సెస్ అయ్యామని కూడా తెలిపారు. దీని ధర విషయానికి వస్తే 899 డాలర్లు కాగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.74,734 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ స్మార్ట్ డివైస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: