సైబర్ నెరగాళ్లు వీటి ద్వారానే సులభంగా మొబైల్ లను ల్యాప్ ట్యాప్ లను హ్యాక్ చేసి వినియోగదారులకు ముప్పు తెచ్చేలా చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా అందుకు సంబంధించి అనేక హెచ్చరికలను కూడా జారీ చేస్తోంది.. సైబర్ నేరగాళ్లు హ్యాకర్లకు సహాయ పడగల గూగుల్ క్రోమ్ లో కొన్ని లోపాలు ఉన్నాయని..chrome V122.0.6261.57 లేదా పాత సంస్కరణలు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నాయంటూ వెల్లడించారు. ఈ లోపాలను పరిష్కరించడానికి గూగుల్ సైతం భద్రత మెరుగుదలను పెంచేసింది.
కొత్త అప్డేట్ ద్వారా క్రోమ్లో బ్రౌన్ చేస్తున్నప్పుడు ప్రమాదాన్ని సైతం నివారించవచ్చు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కూడా నివారించడానికి ఈ గూగుల్ క్రోమ్ కూడా ఉంటుంది. అందుకే గూగుల్ క్రోమ్ ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని దాని కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేసుకోమని గూగుల్ సంస్థ తెలియజేస్తోంది.
1). మొదట మీరు కంప్యూటర్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసిన తర్వాత కుడివైపున మూడు చుక్కల పైన క్లిక్ చేయాలి.
2).ఆ తరువాత కనిపించే గూగుల్ క్రోమ్ గురించి ఎంపిక పైన క్లిక్ చేసిన తర్వాత వెంటనే అప్డేట్ అవడం ప్రారంభమవుతుంది.
3). అలా అప్డేట్ అయిన తర్వాతే క్రోమ్ బ్రౌజర్ ని ఉపయోగించడం చాలా మంచిది.