గూగుల్..IO 2024 లో ఇటీవలే ప్రకటించిన ఆండ్రాయిడ్ 15 ఆవిష్కరణకు సంబంధించి పలు కీలకమైన అంశాలను కూడా వెల్లడించింది. గూగుల్ డెవలపర్ కాన్ఫరెన్స్ మే 14వ తేదీన జరగబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 15 ఫీచర్స్ తో మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగలించిన స్మార్ట్ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నా కూడా ట్రాక్ చేసే విధంగా ఒక కొత్త సాఫ్ట్ వేర్ తీసుకువస్తోందట .ఈ ఫీచర్ ఫోన్ భద్రతతో పాటు పెద్ద అప్డేట్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ఈ ఫీచర్ గురించి పలు రకాల వార్తలు వినిపిస్తుండడంతో వాటికి చెక్ పెట్టారు.


ఆండ్రాయిడ్ 15 వాస్తవానికి ఆఫ్ లైన్ పరికర ట్రాకింగ్ గా పని చేస్తుందంటూ సూచించారు.ఈ ఫీచర్ యాపిల్ కు సంబంధించిన యొక్క ఫైండ్ మై నెట్వర్క్ మాదిరిగానే పనిచేస్తుందట. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినప్పటికీ వారు కోల్పోయిన ఈ పరికరాన్ని గుర్తించే వీలుగా ఉంటుందట.. బ్లూటూత్ సిగ్నల్ ని నిర్వహించడం ద్వారా ఇది సాధ్యమవుతుందంటూ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆండ్రాయిడ్ 15 లో వచ్చి ఇతర ఫీచర్స్ గురించి మరిన్ని విషయాలను వెల్లడించారు.


ఆండ్రాయిడ్ 15 లో వచ్చే ఫీచర్స్ పరికరాల థర్డ్ పార్టీ యాపులను సైతం వివరణ ఇస్తుందట. అయితే ఈ ఫీచర్ ఇంకా కారణ్యం దాల్చలేదని ట్రాకింగ్ కోసం ఆపిల్ స్పెసిఫికేషనులను కూడా ఖరారు చేస్తున్నామని గూగుల్ వెల్లడించింది. అయితే ఇది అమలు కావడానికి కాస్త ఆలస్యం జరుగుతుందని కూడా తెలిపారు. కానీ ఒకసారి అమలు చేసిన తర్వాత అప్గ్రేడ్ చేసిన ఫైండ్ మై డివైస్ నెట్వర్క్ పరికర భద్రతను కూడా మరింత గోప్యతగా ఉంచేందుకు మెరుగుపరుస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతానికైతే మై డివైస్ నెట్వర్క్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన ఆండ్రాయిడ్ మొబైల్ ఓఎస్ పరికరాల పైన పనిచేస్తుందని.. త్వరలోనే ఆఫ్లైన్ పరికరాల ట్రాఫిక్ జోడించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. దీనివల్ల ఇకమీదట మొబైల్ పోయిన దొంగలించిన ఈజీగా కనుక్కోవచ్చని గూగుల్ వెల్లడిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: