ఏదైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు లేదా స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ తో ఫోటోలు తీసుకుంటూ చాలామంది ఉంటారు. అయితే కొన్ని బేసిక్స్ టిప్స్ పాటించడం వల్ల ఫోటోలు మరింత క్లారిటీగా అందంగా తీసుకోవచ్చు.. మొబైల్లో తరచు ఫోటోలు తీసుకునేవారు కొన్ని బేసిక్స్ ను సైతం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.. ముందుగా మొబైల్ లోని ఫోటో ఫ్రేమ్ సైజుని ఖచ్చితంగా 9:16 లేదా 16:9 లో ఉంచడం బెటర్.. దీని ద్వారా ఫుల్ సైజ్ ఇమేజ్ క్యాప్చర్ అవుతుందట.. అలాగే ఇమేజ్ సెట్టింగ్ లోకి వెళ్లి క్వాలిటీ పైన హై క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.


మొబైల్ లో ఫోటోలు తీసేటప్పుడు బయట ఎండ లేదా లైటింగ్ కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు HDR మోడ్ ని ఆన్ చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల దూరంగా ఉన్న లొకేషన్ వ్యక్తులు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తారట.. ప్రస్తుతం ఉన్న మొబైల్స్ లో ఎక్కువగా రెండు మూడు కెమెరాలు ఉంటాయి. ముఖ్యంగా 50..64 mp మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయి. వీటికోసం సపరేట్ ఆప్షన్ కూడా కలిగి ఉంటుందట. కచ్చితంగా వీటిని ఆన్ లో ఉంచి ఫోటో తీస్తే మంచి క్వాలిటీతో వస్తుంది.


చాలామంది మొబైల్ ఫోటోలు తీసేటప్పుడు జూమ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల క్వాలిటీ కూడా ఫోటో ది తగ్గిపోతుంది. అలాగే కెమెరాలు ఫోటో తీస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఎక్స్పోజర్ స్కేల్ అనేది కనిపిస్తుంది ఇది అక్కడ ఉన్న లైటింగ్ను బట్టి పెంచడం లేదా తగ్గించడం వల్ల ఫోటో కూడా చాలా క్లారిటీగా వస్తుందట. ఇమేజ్ బ్లర్ కాకుండా ఉండాలి అంటే ఫోటో తీసేటప్పుడు చేతిని కదపకూడదు. ముందుగా ఫోటో తీసేటప్పుడు కచ్చితంగా స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ చేయడం ఉత్తమం.. ఇలా చేయకపోతే ఫ్రేమ్లో ఉన్న ఇతర సబ్జెక్ట్ ఫోకస్ అయి మిగతావన్నీ బ్లర్ గా వస్తాయి.. మొబైల్ కెమెరా పైన ఎలాంటి గీతలు పడకుండా చూసుకోవాలి. అప్పుడే ఫోటో క్లారిటీ చాలా స్పష్టంగా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: