ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకి పెరుగుతూనే ఉంది.. ఇందుకు  ముఖ్య కారణం పెరిగిన పెట్రోల్ ధరలవల్లే ఎలక్ట్రిక్ బైక్స్ వైపు మక్కువ చూపుతున్నారు. దీంతో పలు రకాల కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్స్ తో, ఉత్తమ మైలేజ్ తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పెట్రోల్ తో నడిచే వాహనాల తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ధర ఉంటుందని ప్రజలు భావిస్తూ ఉంటారు. ధర విషయంలో కాస్త వెనుకడుగు వేస్తూ ఉంటారు కానీ రూ.50 వేల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. వాటి గురించి పూర్తిగా ఎప్పుడు చూద్దాం.


Komaki:
కోమాకి  బ్రాండెడ్ నుంచి వచ్చిన ఎక్స్ జిటి ఎక్స్ వన్  ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.50,855 రూపాయలకే అందుబాటులో ఉన్నది.అయితే ఈ వాహనం చాలా తేలికగా సులువుగా నడుపుకునే విధంగా ఉంటుంది. నగరాలలో వీటిని బాగా ఉపయోగించుకోవచ్చు. సామాన్యులకు కూడా చౌక ధరకే కలిగి ఉంటుంది.


Kinetic E- Luna:
 ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 110 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.. చాలా స్టైలిష్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటుంది. ఆధునిక ఎలక్ట్రిక్ ప్రొఫెషనల్ బైకుగా పేరుపొందింది దీని ధర  రూ.70 వేల రూపాయలు ఎక్స్ షోరూం ధరకే కలదు.

Hero electric optima:
 పై రెండు బైకులతో పోలిస్తే ఈ బైక్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్లకు పైగా వెళ్తుంది. బ్రేకింగ్ రిమోట్, అధునాతన సాంకేతిక ప్రత్యేకతలతో ఈ బైకు ని తయారు చేశారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర సుమారుగా లక్షకు పైగా ఉంటుందట..


ప్రస్తుతం ఈ బైక్స్ అటు సామాన్య ప్రజలకు కూడా అందు బాటు లో కలిగి ఉన్నాయి. అంతేకాకుండా ఇవే కాకుండా మరిన్ని చౌకైన ఎలక్ట్రిక్ బైకులు కూడా ఉన్నవి..

మరింత సమాచారం తెలుసుకోండి: