మనం ఎవరికైనా సరే మెయిల్ ని కాన్ఫిడెన్షియల్ గా పంపించాలంటే..అయితే ఈ ఫీచర్ ని సైతం ఎనేబుల్ చేసుకొని.. రహస్యంగా పంపించుకోవచ్చు. ఇలాంటివి చేయాలంటే మెయిల్ పంపుతున్నప్పుడు లాక్ గుర్తు పైన లాంగ్ ప్రెస్ చేయాలి. దీంతో అప్పుడు మీరు పంపే మెయిల్ కాన్ఫిడేషన్ గా మారిపోతుందట.
ఒకవేళ మీరు పంపించిన మెయిల్ ఎవరైనా చదివినట్లు తెలియాలి అంటే..shift+1 షార్ట్ కట్ ను ఉపయోగిస్తే సరిపోతుంది.
మనం మెయిల్స్ ని ఏదైనా సమయానికి పంపించాలి అనుకున్నప్పుడు షెడ్యూల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది.. ఈ ఫీచర్ సహాయంతోనే మనం పంపాలనుకున్న మెసేజ్ అనుకున్న సమయానికి షెడ్యూల్ చేయడం వల్ల వెళ్తుంది. ఇందుకోసం షెడ్యూల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ డేటు టైముని సెట్ చేసుకోవాలి.
మెయిల్లో రైట్ క్లిక్ చేసినప్పుడు అటాచ్మెంట్, move too, ట్యాబ్, సెర్చ్ ఆప్షన్ ,రిప్లై ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.. వీటి సహాయం ద్వారా మనం చేయాలనుకున్న వాటిని సులభంగా పూర్తి చేసుకోవచ్చట. అంతేకాకుండా ఎవరికైనా ఫోటోలు పిడిఎఫ్ వంటివి షేర్ చేయాలంటే అటాచ్మెంట్ ద్వారా పంపించవచ్చు. హై క్వాలిటీ తో వీటిని సెండ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఎన్నో రకాల ఫీచర్స్ జిమెయిల్ లో ఉన్నవి..