అయితే ఇలా యాపిల్ ఐఫోన్ తర్వాత మార్కెట్లో ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న మొబైల్ ఏదైనా ఉంది అంటే అది వన్ ప్లస్ అని చెప్పాలి. యాపిల్ ఫోన్ కొనుగోలు చేసేందుకు డబ్బులు తక్కువగా ఉన్న వినియోగదారులు అందరూ కూడా ఇక వన్ ప్లస్ ఫోన్ ని కొనుగోలు చేయడం చేస్తూ ఉంటారు. మిగతా ఫోన్లతో పోల్చి చూస్తే అద్భుతమైన ఫీచర్లు.. క్వాలిటీ కలిగి ఉండే వన్ ప్లస్ ఫోన్లు విపరీతంగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఇండియాలో ఈ ఫోన్లోకి మంచి మార్కెట్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇండియాలోని కొన్ని రాష్ట్రాలలో వన్ ప్లస్ ఫోన్లు ఇకనుంచి కనిపించపోవచ్చట. వచ్చే నెల ఒకటో తారీకు నుంచి కూడా వన్ ప్లస్ ఫోన్లు మాయం కాబోతున్నాయట.
తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ లాంటి స్టేట్స్ లో వన్ ప్లస్ ఫోన్లు ఆఫ్లైన్ స్టోర్లలో లభించకపోవచ్చు అన్నది తెలుస్తుంది. ఆ ఫోన్ల అమ్మకాల వలన తమకు మార్జిన్లు ఉండకపోవడమే కాదు.. ఇక తమ సమస్యలను వన్ ప్లస్ పెడచెవిన పెడుతుంది అంటూ సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇక తమ స్టోర్ లలో ఆఫ్లైన్లో వన్ ప్లస్ మొబైల్స్ ని అమ్మేది లేదు అంటూ చెప్పింది. ఈ మేరకు వన్ ప్లస్ సేల్స్ డైరెక్టర్ కు ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ ఒక లేఖ రాసింది. దీన్ని బట్టి ఇక వచ్చే నెల ఒకటో తారీకు నుంచి ఆఫ్లైన్ స్టోర్స్ లో వన్ ప్లస్ ఫోన్లు ఇక కనిపించకపోవచ్చు.