రిలయన్స్ జియో ముందు నుండి ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది.. ఈ ఆఫర్ల వల్ల చౌక ధరకే మనకు 4 జి 5జి డేటా కూడా అందుతోంది. ఇప్పుడు తాజాగా మనకు రూ.749 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం తెలుసుకోబోయేది.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలలోనే కేవలం మూడు నెలలు అన్లిమిటెడ్ లాభాలను కూడా కస్టమర్లకు అందిస్తోంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. అలా 90 రోజులు వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు రోజుకు 2gb హై స్పీడ్ డేటాను చొప్పున..180 gb డేటా ను అందిస్తుంది.. అలాగే 20 gb అదనపు డేటాను కూడా అందిస్తుందట.
ఈ జియో ప్లాన్ 90 రోజులకు గాను మొత్తం 200 gb హై స్పీడ్ డేటాను అందిస్తుంది. అలాగే 90 రోజుల పాటు 100 sms లను కూడా ఉపయోగించుకొనే అవకాశం ఉన్నది.. వీటితో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఆప్షన్ కూడా మనం ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. వీటితో పాటుగా కాలర్ టోన్స్ లాంటివి కూడా చేంజ్ చేసుకుని అవకాశం ఈ ప్లాన్ లో కల్పించినట్లుగా కనిపిస్తోంది. చౌక ధరకే ఎక్కువ డేటా వినియోగించుకోవాలనుకునే వారికి ఈ ప్లా బాగా ఉపయోగపడుతుంది.