వాట్సాప్  అనే మెసెంజర్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న యాప్సులలో ఒకటి. వాట్సప్ ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతూనే ఉంది. ఎటువంటి సమాచారాన్ని అయినా సరే మనం క్షణాలలో పంపించవచ్చు. యూజర్స్ కు అనుగుణంగానే ఎప్పటికప్పుడు కొత్త ఫిచర్స్ ను సైతం వాట్సాప్ తీసుకువస్తూనే ఉంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలోకి కూడా వాట్సప్ అడుగు పెట్టింది. AI టెక్నాలజీకి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో మెటా కూడా ఆ వైపుగా అడుగులు వేసింది.


ఇప్పటికే కొంతమంది యూజర్స్ కి సైతం ఈ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చిందట. ముఖ్యంగా వాట్సాప్ చాట్ ఓపెన్ చేయగానే.. అక్కడ రౌండ్ షేప్ లో ఒక సింబల్ కూడా కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ ఏంటి వాటి యొక్క ఉపయోగాలు విషయానికి వస్తే.. మెటా తీసుకువచ్చిన ఈ ఏఐ ఫిచర్ తో సెర్చ్ టూ ల్ చేసుకోవచ్చు అచ్చం చాట్ జిపిటి లా కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది. రౌండ్ సింబల్ కనపడగానే క్లిక్ చేస్తే.. మెటా AI విత్ లామా అనే చాట్ ఫేస్ ఓపెన్ అవుతుంది.


ఆ తర్వాత ఈ అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ తో ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా మనకి వెంటనే సమాధానాన్ని తెలియజేస్తుంది. అయితే మరికొన్ని ప్రశ్నలకు సబ్జెక్టును కూడా అదే జవాబు ఇస్తుందట.. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ చాట్ బాట్ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉన్నది. అయితే ఇతర భాషలలో కూడా రాబోయే రోజులు అందించే విధంగా మెటా ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ముందుగా వాట్సప్  ఓపెన్ చేయగానే కనిపించే రౌండ్ ఐకాన్ ప్లాన క్లిక్ చేస్తే అనంతరం టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేయాలి. మీకు ఏదైనా సమాధానాలు కావాలి అంటే అక్కడ సెర్చ్ చేసిన తర్వాత సెండ్ బటన్ మీద నొక్కితే చాలు వెంటనే మీకు టెక్స్ట్ లేదా ఫోటోల రూపంలో ఏదైనా సమాధానాలను అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AI