నావిగేషనల్ సిగ్నల్స్ ఆధారంగానే విమానాలు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా తూర్పు ఐరోపా దేశాల పరిధిలోని బాల్టిక్ ప్రాంతాన్ని నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ సమస్య పట్టి పీడిస్తోంది. వీటికి కారణం రష్యా అయి ఉండొచ్చని పలు ఐరోపా దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. నకిలీ జీపీఎస్ సిగ్నల్స్ సమస్య కారణంగా గత రెండు రోజుల్లో 1614 విమాన సర్వీసులు ప్రభావితం అయ్యాయని సమాచారం.


పోలాండ్, దక్షిణ స్వీడన్, ఫిన్లాండ్, ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉందని అంటున్నారు. బాల్టిక్ సముద్రంతో పాటు నాటో దేశాల సమీపంలోకి వచ్చే పౌర విమానాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నకిలీ సిగ్నల్స్ ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. విమానాల నావిగేషన్ కు అవసరమైన జీపీఎస్ వ్యవస్థను నిలిపివేసే టెక్నాలజీ రష్యా వద్ద ఉందని స్వీడన్ ఆర్మీ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తోంది.


నావిగేషన్ వ్యవస్థను ఏమార్చి విమానాలను తప్పుదోవ పట్టించేలా నకిలీ జీపీఎస్ సిగ్నల్స్  ఉన్నాయని అంటోంది. విమానాల నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసే నకిలీ జీపీఎస్ ద్వారా విమనాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ అంటారు. నిజమైన శాటిలైట్స్ సిగ్నల్స్ ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవరన్ ను తప్పుదోవ పట్టించడమే ఈ జీపీఎస్ స్పూపింగ్ ప్రత్యేకత.


అయితే ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో బ్రిటన్ వచ్చి చేరింది. ఆ దేశానికి సంబంధించిన మంత్రి ప్రయాణిస్తున్న విమాన సిగ్నల్స్ ఒక్కసారిగా జామ్ అయ్యాయని పేర్కొంది. ఇదొక్కటే కాదు తమ దేశ పౌరులు ప్రయాణిస్తున్న విమానాలు సైతం అనేకం తప్పుదోవ పడుతున్నాయని పేర్కొంది. దీనికి కారణం రష్యానే అని ఆరోపించింది. అయితే పౌర విమానాలే లక్ష్యంగా చేసుకొని ఇలా దాడులు జరగడం ఆందోళన కలిగించే అంశం. ఏదైనా విమానం తప్పుడు డైరెక్షన్ లో ప్రయాణిస్తే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: