ఈ స్మార్ట్ ఫోన్ ను 30 నిమిషాలు చార్జ్ చేస్తే ఫుల్ చార్జ్ అవుతుందట. అంతేకాదు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసామంటే రెండు రోజులు వరకు చార్జింగ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే.. 5.5 అంగుళాల హెచ్డి డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇందులో సులభంగా 4K వీడియో లు చూడవచ్చు.. ప్రస్తుత కాలంలో అందరూ 5g స్మార్ట్ ఫోన్ కి ఓటు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 5జి స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. తాజాగా అందుతున్న మీడియా నివేదికల ప్రకారం జూన్ రెండు లేదా మూడవ వారంలో ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఇకపోతే లాంచ్ తేదీ సమయంలోనే ఈ స్మార్ట్ఫోన్ సంబంధించిన అన్ని విషయాలు కూడా వెలువడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దీని ధర కేవలం రూ.3000 వరకు మాత్రమే.. ఏది ఏమైనా హై ఫీచర్లతో తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.