ఇండియాలో మొదటి దశలో సెల్ ఫోన్ లలో ప్రభంజనం సృష్టించిన కంపెనీ నోకియా. భారత దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ శాతం మంది నోకియా మొబైల్స్ నే వాడేవారు. అందులోనే ఎక్కువ ఫ్యూచర్స్ ఉండేవి , అలాగే ఆ ఫోన్లు చాలా కాలం ఆగుతాయి అనే నమ్మకంతో ఎక్కువ మంది ఆ కంపెనీ ఫోన్లను వాడడానికి చాలా ఆసక్తిని చూపించేవారు. ఇకపోతే నోకియా కంపెనీలలో చిన్న స్థాయి ఫోన్ల నుండి మొదలు పెడితే మధ్య స్థాయి , భారీ స్థాయి ఫోన్లు కూడా ఉండేవి.

దానితో ఎవరి తాహతకు తగ్గ స్థాయిలో వారు నోకియాకు సంబంధించిన ఫోన్ లనే ఎక్కువ వాడుతూ ఉండేవారు. దానితో ఈ కంపెనీ ఇండియాలో చాలా తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి చెందింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కంపెనీ కి భారీ పోటీ ఏర్పడింది. మార్కెట్ లోకి అనేక కొత్త రకం సెల్ ఫోన్లు కంపెనీలు రావడం , అవి అద్భుతమైన ఫ్యూచర్స్ చాలా తక్కువ ధరకే ఇస్తూ ఉండటంతో నోకియా కంపెనీ ఫోన్లు చాలా వరకు కనుమరుగయ్యాయి.

కానీ నోకియా ఫోన్స్ అంటే తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్స్. మరోసారి మార్కెట్ లకి అలాంటి సెల్ ఫోన్ ను ఈ సంస్థ విడుదల చేసింది. దాని వివరాలు తెలుసుకుందాం. నోకియా కంపెనీ ఇండియాలో చాలా సంవత్సరాలు నెంబర్ 1 కంపెనీగా నిలబడడానికి సహాయపడిన మాడల్ లలో నోకియా 3210 మోడల్ ప్రధానంగా ఉంటుంది. ఇక ఇంతటి క్రేజ్ కలిగిన ఈ మోడల్ ఫోన్ ని మరోసారి నోకియా సంస్థ HMD గ్లోబల్ సంస్థ నోకియా బ్రాండ్ పై ఇండియన్ మార్కెట్లోకి దీన్ని లాంచ్ చేసింది.

2.4 అంగుళాల డిస్ ప్లే కలిగిన ఈ మొబైల్ లో 2 mp కెమెరా , 64 MB ram , USB టైప్ C పోర్ట్ ఉంటాయి. యూట్యూబ్ , న్యూస్ , గేమ్స్ కోసం వేర్వేరు యాప్స్ సపరేట్ గా ఇచ్చారు. ఎంతో ఫేమస్ అయిన స్నేక్ గేమ్ కూడా ఇందులో ఉండబోతుంది. డ్యూయల్ సిమ్ 4G vo LTE సపోర్టుతో ఈ ఫోన్ వస్తుంది. ఇక ఇన్ని ఫ్యూచర్స్ కలిగిన ఈ మొబైల్ కేవలం 399 రూపాయలకే అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: