అయితే ఒకప్పుడు బైక్ లకు కంపెనీలను బట్టి గేర్ షిఫ్టింగ్ అనేది ఉండేది. హీరో, హోండా లాంటి కంపెనీ బైకులకు నాలుగు గేర్లు వెనకవైపు ఉంటే.. టీవీఎస్, బజాజ్ లాంటి బైక్ లకు మాత్రం అన్ని గేర్లు ముందుకు ఉండేవి కానీ ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్ బైక్ లకు మాత్రం ఫస్ట్ గేర్ ముందుకు ఉండి మిగతా అన్ని గేర్లు కూడా వెనక్కి ఉంటున్నాయ్. అయితే కేరళలో ఇలా ఒకటి ముందుకు ఉండి.. మిగతా అని ఎందుకు ఉంటాయో అనే డౌట్ దాదాపు ఎవరికీ రాక పోవచ్చు. ఇలా ఒక గేర్ ముందుకు ఉండి మిగతా గేర్లు వెనక్కి ఉంటే వన్ డౌన్ 4/5 అప్ పేటర్న్ అని అంటారు. ఇది గ్లోబల్గా అంగీకరించబడింది. ఇలా ఉండటం వల్ల న్యూట్రల్ నుంచి ఒకేసారి ఆఖరికి ఏరుకు వెళ్లలేరు. కచ్చితంగా ఒకటి రెండు మూడు ఇలా ఒక గేరు వేసుకుంటూ వెళ్లాల్సిందే.
కానీ పాత బైకుల్లో న్యూట్రల్ తర్వాత గేర్లు వరుసగా ఉండేవి దీని వల్ల ఒక్కోసారి ఒక గేర్ స్కిప్ అయిపోయేది అంటే న్యూట్రల్ నుంచి ఫస్ట్ గేర్ కి వచ్చాక సెకండ్ వేయకపోతే మూడో గేర్ పడుతుంది దీనివల్ల బండి సడన్గా ఆగిపోయే ఛాన్స్ కూడా ఉండేది. ఇదొక కారణం వల్ల ఇప్పుడు చాలా బైక్స్ ఒక గేరు ముందుకి న్యూట్రల్ పైన మిగతా గేర్లు పెడుతున్నారు. ఇది మాత్రమే కాకుండా మరో కారణం కూడా ఉందట. రోడ్డు మీద వేగంగా వెళ్తున్నప్పుడు సడన్గా వాహనాలు అడ్డుపడినప్పుడు బైక్ స్పీడ్ ని తగ్గించాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ గేర్లు డౌన్ చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ ఫాస్ట్ గా గేర్లను డౌన్ చేస్తుంటాం. పాత బైక్ లో లాస్ట్ గేర్ అంటే న్యూట్రల్. కాబట్టి బండి సడన్గా ఆగిపోతుంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అదే ఇప్పుడు వస్తున్న బైక్స్ లో కిందకి గేర్లు ప్రెస్ చేస్తే లాస్ట్ గేర్ ఫస్ట్ గేర్ అవుతుంది. దీనివల్ల బైక్ అనేది అక్కడే ఆగిపోదు. దానివల్ల ప్రమాదాలు కూడా నివారించేందుకు అవకాశం ఉంటుందని ఇలా ఒక గేర్ ముందుకి మిగతా అన్ని గేర్లు వెనక్కి పెడుతున్నారట.