నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవన శైలి ఎంతో సులభతరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు చెమటోడ్చి కష్టపడితే తప్ప ఏ పని పూర్తి అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే అన్ని పనులు చేసేయ్య గలుగుతున్నాడు మనిషి. అంతలా టెక్నాలజీ మనిషి జీవన శైలిలో మార్పులు తీసుకువచ్చింది. అయితే ఇక ఇలా టెక్నాలజీకి బాగా అలవాటు పడుతున్న మనిషి ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని సరికొత్త ఆవిష్కరణలను కనుగొనడంలో కూడా విజయం సాధించగలుగుతున్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో కొన్ని కొన్ని ఆశ్చర్యపరిచే పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా నేటి రోజుల్లో స్మార్ట్ వాచ్లు ఎంతల ప్రతి ఒక్కరు జీవితంలో భాగంగా మారిపోయాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు మనం ఎన్ని అడుగులు వేస్తున్నాం.. మన హార్ట్ బీట్ ఎలా ఉంది. అంతేకాదు మన శరీరం ఉష్ణోగ్రత ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్పే విధంగా స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి స్మార్ట్ వాచ్ లను అందరూ కొనుగోలు చేస్తూ టెక్నాలజీని తెగ వాడేస్తున్నారు.


 అయితే ఇన్ని రోజుల వరకు ఇలా స్మార్ట్ వాచ్ లు మాత్రమే వాడటం చేసేవారు. కానీ ఇప్పుడు ఇక ఈ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కి.. ఏకంగా స్మార్ట్ రింగు కూడా అందుబాటులోకి వచ్చేస్తుంది. స్మార్ట్ వాచ్ ఏదైతే చేస్తుందో అంతకుమించి అనే రీతిలోనే ఈ స్మార్ట్ రింగు పనిచేస్తుంది. టెక్ దిగ్గజం అయిన సాంసంగ్  ఏకంగా స్మార్ట్ రింగును విడుదల చేసింది. సాంసంగ్ గెలాక్సీ రింగ్ పేరుతో రిలీజ్ అయిన ఈ రింగ్ మానవ జీవన శైలిని క్యాప్చర్ చేస్తుందట. శాంసంగ్ హెల్త్ యాప్ లోని ఏఐ వ్యక్తికి సంబంధించిన పీరియడ్స్ టైమింగ్, స్లీప్ ట్రాకింగ్, హృదయ స్పందన రేటు స్కిన్ టెంపరేచర్ వంటి వాటి విషయాన్నీ కూడా తెలియజేస్తుంది. అయితే ఇది భారత కరెన్సీలో ఏకంగా 33 వేల రూపాయల ఖరీదైన రింగుగా ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: