వాట్సాప్ నుంచి వచ్చే ప్రతి కొత్త అప్‌డేట్‌పై వాట్సాప్ బీటా ఇన్ఫో తన నివేదికలో ఇటీవల కీలక విషయం వెల్లడించింది. మెటా అధీనంలోని వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన అధికారిక వాట్సాప్ ఛానల్ ద్వారా కొత్త ఫీచర్ వివరాలను ఇటీవల తెలియజేశారు. వాట్సాప్ వినియోగదారులు తమ చాటింగ్ యాప్‌లో ఇష్టమైన వారి కేటగిరీలో తమ ప్రత్యేక వ్యక్తులను జోడించగలరు. ఫేవరెట్స్ పేరుతో వచ్చిన కొత్త ఫీచర్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఇప్పుడు మీరు మీ 'ఫేవరెట్ కాంటాక్ట్'ను వాట్సాప్‌లో పై భాగంలో ఉంచుకోవచ్చు. యూజర్లు తన తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, స్నేహితులను ఇలా 'ఫేవరెట్ కాంటాక్ట్'గా ఉంచుకోవచ్చు.
మీరు వాట్సాప్‌ను ఓపెన్ చేసినప్పుడు, అందులో ఆల్, అన్ రీడ్, గ్రూప్స్ వంటి మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిత పాటు మీరు ఈ కొత్త 'ఫేవరెట్ కాంటాక్ట్' ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఇందు కోసం మీరు తొలుత సెట్టింగ్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఫేవరెట్స్‌పై క్లిక్ చేసి, మీకు ఇష్టమైన నంబర్లను యాడ్ చేయాలి. ఇందు కోసం ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరు ఎగువ కుడి మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్‌లకు రావాలి. ఇప్పుడుఫేవరెట్ కాంటాక్ట్ ఆప్షన్ కనిపించినప్పుడు, మీరు దానిపై నొక్కండి. ఇక్కడ మీరు ఇష్టమైన వాటికి యాడ్ ఆప్షన్‌ను నొక్కాలి. ఇప్పుడు మీరు కాంటాక్ట్ లిస్ట్‌లో మీకు ఇష్టమైన కాంటాక్ట్‌ని ఎంచుకోవచ్చు. వారితో చేసే చాటింగ్ మొత్తం మీకు ప్రాధాన్యత క్రమంలో పై భాగంలో కనిపిస్తుంది. తద్వారా మీ సన్నిహితులకు వెంటనే రిప్లై ఇచ్చే వీలుంటుంది. ఇలా మీకు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను ఈ ఫీచర్ మరింత దగ్గర చేస్తుంది.