వినియోగదారులకు సరసమైన ధరల్లో తాజాగా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. కొత్త ప్లాన్లలో ఉచిత కాలింగ్, డేటా, ఓటీటీ స్ట్రీమింగ్ బెనిఫిట్స్‌ను అందించడం గమనార్హం. కొత్తగా ప్రకటించిన జియో ప్లాన్లలో రూ. 329 ప్లాన్ ఒకటి. రీచార్జ్ రూ.329 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ రాగా రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ఆఫర్‌లో అపరిమిత ఉచిత కాలింగ్ ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఓటీటీ ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు జియో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. అదేవిధంగా రూ.949 ప్లాన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్ ఒకటి ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులకు పరిమితం. ఈ ప్లానులో భాగంగా అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 2జీబీ డేటా లభిస్తాయి. అదేవిధంగా ఇక ఈ ప్లాన్ కింద డిస్నీ+ హాట్‌స్టార్ (మొబైల్) సబ్‌స్క్రిప్షన్ 90 రోజులకు లభిస్తుంది.
ఈ లిస్టులో మూడవది.. రూ.1,049 ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగా రోజుకు 2జీబీ డేటా , ప్రతి రోజూ 100 ఉచిత ఎంఎస్ఎంలు లభిస్తాయి. ఇక అపరిమిత కాల్స్ అనేవి సర్వసాధారణం అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్‌లో యూజర్లు సోనీలైవ్, జీ5 సబ్‌స్క్రిప్షన్లను ఉచితంగా పొందవచ్చు. ఎక్కువ డేటాతో పాటు వినోదం కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఈ ప్లాన్ కూడా 5జీ వెల్‌కమ్ ఆఫర్‌తో వస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే.. జియో సేఫ్ అనే యాప్ యూజర్లకు ప్రవేశపెట్టింది సదరు సంస్థ.. దీని యాక్సెస్ కోసం మీరు కేవలం నెలకు 199 రూపాయిలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ యాప్ ను మొదటి సంవత్సరం అయితే ఉచితంగా వాడుకొనే వెసులుబాటు కలదు.