అయితే మొన్నటి వరకు ఇలా మొబైల్ ని వాడటానికి ఎంతో ఇష్టపడిన జనాలు ఇక ఎప్పుడూ మొబైల్ వాడాలంటే భయపడిపోతున్నారు. దీనికి కారణం పెరిగిపోయిన టారిఫ్ చార్జీలే జియో ఐడియా వోడాఫోన్ ఎయిర్టెల్ లాంటి మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఇటీవలే టారిఫ్ చార్జీలను విపరీతంగా పెంచేశాయి. ఇక ఈ పెరిగిన చార్జీలు సామాన్య ప్రజలు అందరిని కూడా బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. ఇక చార్జీలతో ఇబ్బందులు పడటం కంటే మొబైల్ వాడటం తగ్గిస్తే బాగుండు అని ఆలోచన వచ్చిన.. అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా భయం పుట్టిస్తుంది. అయితే ప్రస్తుతం మొబైల్ నెట్వర్క్ అందిస్తున్న ప్యాకేజీలలో అటు అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు డాటా ఇక సాధారణ ఎస్ఎంఎస్ లు కూడా వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.
అయితే చాలామందికి ఇలా అన్లిమిటెడ్ కాల్స్ మాత్రమే అవసరం ఉంటాయి. కొంతమందికి డేటా మాత్రమే అవసరం ఉంటుంది. ఇంకొంతమందికి ఆదరణ ఎస్ఎంఎస్ లు అవసరం ఉంటాయి. కానీ ఇవన్నీ కలిపి ఇవ్వడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే వాయిస్ కాల్స్, డేటా,ఎస్ఎంఎస్లు విడివిడిగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని ట్రాయ్ భావిస్తుంది. వచ్చే నెల 16లో ఒక తమ అభిప్రాయాలు తెలియజేయాలని వినియోగదారులను కోరింది. ప్రస్తుతం ప్రస్తుతం అన్నీ కలిపి ఒకే ప్యాకేజ్ లో వస్తుండడంతో కొంతమంది ఎస్ఎంఎస్లు వాడటం లేదని అయినా డబ్బులు చెల్లిస్తున్నామని.. ఇంకొంతమంది డేటా వాడకపోయినా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అంటూ వాపోతున్నారు.