ఎయిర్టెల్, జియో కంపెనీలకు షాక్.. కేవలం 15 రోజుల్లో అన్నీ లక్షల బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌కార్డులు సొల్డ్!
జియో కంపెనీ తన ఫోన్ బిల్లుల ధరలు చాలా పెంచేసింది. దీంతో చాలామంది జియో నుంచి వేరే కంపెనీకి మారాలని నిర్ణయించుకున్నారు. అయితే అలాంటి వారందరికీ బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది. అందుకే చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ తీసుకోవడం ప్రారంభించారు.
బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ కాలింగ్, ఇంటర్నెట్ వంటి సర్వీసుల విషయంలో ప్రైవేట్ కంపెనీల కంటే కొంచెం వెనుకబడి ఉంది. ప్రైవేట్ కంపెనీలు 5g అనే చాలా వేగవంతమైన నెట్‌వర్క్‌ని ఇస్తుంటే, బీఎస్‌ఎన్‌ఎల్ ఇంకా 4G నెట్‌వర్క్‌నే అందిస్తోంది. అయినా కూడా, ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద ఫోన్ కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ అనే విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికీ చాలా మంది దీనినే వాడుతున్నారు.
కొన్నేళ్ల క్రితం, దాదాపు 20-25 సంవత్సరాల క్రితం చూస్తే, బీఎస్‌ఎన్‌ఎల్ కి దాదాపు 18 శాతం మంది కస్టమర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రైవేట్ కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలు పెంచడంతో చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్ కి మారుతున్నారు. జులై నెలలో మొదటి పదిహేను రోజుల్లోనే దాదాపు 15 లక్షల మంది కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్లు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. 15 రోజుల్లోనే ఇంతమంది కస్టమర్లు రావడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పుకోవచ్చు. అద్భుతమైన సర్వీసులు అందిస్తున్న బడా కంపెనీలు కూడా తక్కువ సమయంలో 15 లక్షల మైలురాయిని అందుకోవడం కష్టం.