రిలయన్స్ జియో త్వరలోనే.. జియో భారత్ -1 5g పేరిట ఒక స్మార్ట్ ఫోన్ ని విడుదల చేయబోతోంది ఈ ఫోన్ ధర కూడా సామాన్యులకు కొనుగోలు చేసే ధరలకే ఉండేలా ఉంటుందట ఫీచర్స్ విషయానికి వస్తే.. సరికొత్త ఫీచర్స్తో ఈ స్మార్ట్ మొబైల్ ని తయారు చేయబోతున్నారు. దీని ధర రూ.5999 రూపాయలకి వచ్చే అవకాశం ఉన్నది. కెమెరా కూడా హై రిసొల్యూషన్ కెమెరా అనే కలిగి ఉంటుందట.. అమౌల్డ్ డిస్ప్లే తో కలిగి ఉంటుంది. సరికొత్త స్టైల్ డిజైన్ లో కూడా ఈ మొబైల్ ని తయారు చేస్తున్నారట.
డిస్ప్లే విషయానికి వస్తే 6.7 అంగుళాల డిస్ప్లే తో సరికొత్త స్టైలిష్ డిజైన్తో తయారు చేయబోతున్నారు. అయితే రామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ధరను బట్టి మారుతూ ఉంటుంది.. జియో మొబైల్ 144HZ రిఫ్రెష్ రేటుకు సపోర్టుగా ఉంటుంది. దీనివల్లే మనం మొబైల్ ని కూడా స్మూత్ గా ఉపయోగించుకోవచ్చు. బడా కంపెనీలతో చేతులు కలిపి జియో 5g మొబైల్ ని సైతం తయారు చేస్తోందట. ప్రస్తుతం ఈ మొబైల్ టెస్టింగ్ స్టేజ్ లో ఉందని.. త్వరలోనే అధికారికంగా ఈ మొబైల్ ని లాంచ్ చేసే విషయాన్ని జియో ప్రకటించబోతున్నారు.