మనం కారు లేదా బైక్‌లో దూర ప్రయాణానికి బయలుదేరే ముందు, ఇంటి దగ్గరే పెట్రోల్ బంక్‌కు వెళ్లి వాహనం ట్యాంక్ నిండా పెట్రోల్ పోయించుకుంటాం. అయితే ఇలా ట్యాంక్ నింపడం కొన్ని సమస్యలకు దారితీయొచ్చు. ప్రతి కారు, బైక్ ట్యాంకులో ఎంత పెట్రోల్ పడుతుంది అనేది వేరు వేరుగా ఉంటుంది. కొన్ని వాహనాల ట్యాంకు కెపాసిటీ 25 లీటర్లు అయితే, మరికొన్ని వాహనాల ట్యాంకు కెపాసిటీ 35 లీటర్లు ఉంటుంది. బైక్‌ల ట్యాంకులు సాధారణంగా 10 నుంచి 18 లీటర్ల వరకు ఉంటాయి. కొన్ని సార్లు పెట్రోల్ బంక్‌లో పని చేసేవారికి మన వాహనం ట్యాంకు ఎంత కింద వస్తుందో తెలియక, అవసరం కంటే ఎక్కువ పెట్రోల్ పోయవచ్చు.

దీనివల్ల కారు లేదా బైక్ ట్యాంక్‌ని నిండా పెట్రోల్ వేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అవేవో తెలుసుకుంటే.

పెట్రోల్ లీకేజ్

మనం వాహనం నడిపేటప్పుడు ట్యాంక్‌లోని పెట్రోల్ బాగా కదులుతుంది. ట్యాంక్ నిండా ఉన్నప్పుడు, కొంత పెట్రోల్ బయటకు ఎగిసి పడే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా వాహనాన్ని ఏదైనా ఇరుకు ప్రదేశంలో పార్క్ చేస్తే ఇలా జరగవచ్చు. పెట్రోల్ చాలా త్వరగా మంట అంటుకునే స్వభావం గల లిక్విడ్ కాబట్టి ఇది చాలా ప్రమాదకరం.

అగ్ని ప్రమాదం

వేసవి కాలంలో వాహనం ట్యాంక్ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో పెట్రోల్ ఆవిరి అవుతుంది. ట్యాంక్ నిండా ఉన్నప్పుడు ఆ ఆవిరికి బయటకు వెళ్లడానికి స్థలం ఉండదు. దీంతో అగ్ని ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ట్యాంక్‌లో కొంచెం స్థలం ఉండేలా చూసుకోవాలి.

ఫ్యూయల్ పంప్‌పై ప్రభావం

ట్యాంకు నిండా పెట్రోల్ పోయిస్తే, పెట్రోల్ ఆవిరికి బయటకు వెళ్లడానికి స్థలం ఉండదు. దీంతో ఫ్యూయల్ పంప్‌పై అధిక ఒత్తిడి వస్తుంది. ఫలితంగా ఫ్యూయల్ పంప్ లీక్ అయ్యే అవకాశం ఉంది లేదా వాహనానికి ఇతర రకాల నష్టం జరగవచ్చు.

వాహనం ట్యాంకులో పట్టే మొత్తం పెట్రోల్ కంటే 1-2 లీటర్లు తక్కువగా పెట్రోల్ ఫిల్ చేయించుకోవడం  మంచిది. అంటే ఒక వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 20 లీటర్లు అయితే 18 లీటర్లు మాత్రమే పెట్రోల్ పోయించుకోవాలి. ఇలా చేస్తే ఫ్యూయల్ పంప్‌పై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా, వాహనాన్ని గరుకు రోడ్లపై నడిపినప్పుడు పెట్రోల్ సులభంగా అటూ ఇటూ కదలడానికి వీలుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: