ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్మార్ట్ మొబైల్స్ ను నెట్వర్క్ సంస్థలే విడుదల చేస్తూ ఉన్నాయి. అలా జియో మొబైల్స్ తో పాటు సిమ్ములను కూడా తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా వీరి బాటలోనే బిఎస్ఎన్ఎల్ కూడా రాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వోడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, జియో వంటివి కూడా జులై నెల నుంచి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లను సైతం భారీగానే పెన్ చేశారు. దీంతో చాలామంది బిఎస్ఎన్ఎల్ వైపుగా అడుగులు వేస్తున్నారు. దీంతో పోల్చుకుంటే ఇతర టెలికాం కంపెనీలు కూడా భారీగా పెంచేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ను మరింత విస్తరింపజేసేలా ప్లాన్లు చేస్తున్నారట.


ఈ నేపథ్యంలోనే బిఎస్ఎన్ఎల్ 5జి స్మార్ట్ మొబైల్స్ ను కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి. అయితే బిఎస్ఎన్ఎల్ తన 5జి ఫోన్ను త్వరలోనే విడుదల చేయబోతుందని అది కూడా 200 మెగా ఫిక్సెల్ కెమెరాతోపాటుగా..7000 MAH బ్యాటరీతో తీసుకురాబోతున్నారట.ఇలా 5g స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్న వార్తలపై బిఎస్ఎన్ఎల్ కూడా స్పందించింది. అధికారికంగా ప్రభుత్వ టెలికాం సంస్థ ట్విట్టర్ నుంచి క్లారిటీ ఇచ్చింది.


అయితే ఇలాంటి విషయాలు నమ్మవద్దని తెలియజేస్తోంది బిఎస్ఎన్ఎల్ సంస్థ .అయితే ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ ఎవరు కూడా ట్రాప్ లో పడి తీసుకోవద్దండి ఎలాంటి విషయం అయినా సరే బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ నుంచి అధికారికంగా తెలియజేస్తామంటూ సూచించింది. తాము ఇప్పుడు ఎటువంటి స్మార్ట్ ఫోన్లను తీసుకురాలేదని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఫోర్ జి నెట్వర్క్ ని ఆగస్టు 15 నుంచి పూర్తిగా విస్తరింప చేసేలా చేస్తున్నామని.. రాబోయే రోజుల్లో కచ్చితంగా 4G, 5g నెట్వర్క్ సైతం అన్ని ప్రాంతాలలో అందుబాటులో తీసుకురాబోతున్నామంటూ తెలియజేసింది బిఎస్ఎన్ఎల్ సంస్థ. దీంతో బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు కాస్త నిరాశతో ఉన్నప్పటికీ నెట్వర్క్ విషయంలో ఆనందపడేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: