గ్యాస్ పైపులలో లీక్‌లను కనుగొనడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. బ్యాటరీ చాలా చిన్నది, ఇది చిన్న కంప్యూటర్లు, సెన్సార్లకు శక్తినిస్తుంది. టెక్నాలజీలో ఇదొక పెద్ద ముందడుగు అని చెప్పుకోవచ్చు. MIT సైంటిస్ట్ మైఖేల్ స్ట్రానో మాట్లాడుతూ ఈ కొత్త మైక్రోబ్యాటరీ రోబోలకు బాగా పనికొస్తుందని చెప్పారు. ఈ చిన్నపాటి బ్యాటరీలతో రోబోలను తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోబోలు చాలా చిన్నవిగా ఉంటాయి. కొన్ని రోబోలు తోలుబొమ్మల్లా ఉంటాయి. అవి వేరొకదాని ద్వారా నియంత్రించబడతాయి. ఈ రోబోలకు బ్యాటరీలు అవసరం లేదు. ఎందుకంటే అవి ఇతర వాటి నుంచి శక్తిని పొందుతాయి.
కానీ మనం చేరుకోలేని ప్రదేశాలకు రోబోలు వెళ్లాలంటే, వాటికి వాటికి శక్తి అవసరం. ఇక్కడ చిన్న బ్యాటరీ ఉపయోగపడుతుంది. ఇది ఈ చిన్న రోబోలకు శక్తిని ఇవ్వగలదు. శాస్త్రవేత్తలు చిన్న బ్యాటరీని పెద్ద యంత్రానికి కనెక్ట్ చేయడానికి వైర్‌ను ఉపయోగించారు. ఈ చిన్న రోబోలు మానవ శరీరంలోని సమస్యలను తనిఖీ చేయడం వంటి ముఖ్యమైన పనులను చేయగలవని వారు భావిస్తున్నారు. శరీరంలోని నిర్దిష్ట ప్రదేశాలకు ఇన్సులిన్ వంటి ఔషధాలను అందించడానికి ఈ రోబోలను ఉపయోగించాలనుకుంటున్నారు. శరీరానికి సురక్షితంగా ఉండే పదార్థాలతో రోబోలను తయారు చేయనున్నారు. శాస్త్రవేత్తలు బ్యాటరీని మరింత శక్తివంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధన చేయడానికి వారు యూఎస్ ప్రభుత్వం నుండి డబ్బు పొందారు.