* itel కలర్ ప్రో 5g
ఈ స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ ప్రైస్ రూ.13,499 ఉండగా ప్రస్తుతం సేల్‌లో 26 శాతం తగ్గి కేవలం రూ. 9,999కే లభిస్తుంది. నిర్దిష్ట బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులను కొనుగోలు చేసే సమయంలో ఉపయోగించినట్లయితే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. 50 mp AI కెమెరా, 5000mAh బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్‌లోని కీ ఫీచర్లు. 6GB RAM, 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.
* నోకియా G42 5G:
నోకియా G42 రూ.10 వేల సెగ్మెంట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోంది. ఈ ఫోన్ ఒరిజినల్ ప్రైస్ రూ.12,999 కాగా అమెజాన్ సేల్‌లో రూ.9,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 50-MP ట్రిపుల్ రియర్ AI కెమెరా ఆఫర్ చేశారు. నోకియా ఈ మొబైల్‌కు 2 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ కూడా పంపిస్తుంది.
పోకో C65:
ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 11,999 ప్రైస్ టాక్ తో లాంచ్ అయింది కానీ అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌లో జస్ట్ రూ.7099కే పొందవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉండటం విశేషం. 50MP రియర్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఈ మొబైల్ ఇతర ప్రత్యేకతలు.
రెడ్‌మీ 13C:
రెడ్‌మీ 13c ఫోన్ రూ.13,999 రేటుతో లాంచ్ కాగా ఇప్పుడు రూ. 8499కి లభిస్తోంది. ఈ మొబైల్ మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్‌తో చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. 50-MP AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఆఫర్ చేశారు కాబట్టి ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ M14:
ఈ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ రూ.13,999 ధరతో లాంచ్ అయింది కానీ అమెజాన్ సేల్‌లో కేవలం రూ. 8,394కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5000 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అందించారు.