2008వ సంవత్సరంలో కేవలం లక్ష రూపాయలకే కారంటూ నానో సమస్త సృష్టించిన ఒక సంచలనం ఇప్పటికీ ఇతర బ్రాండెడ్ కార్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా ఈ కారుని చాలామంది వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఆ తర్వాత కొన్నేళ్లకు ఇవి కనుమరుగైపోయాయి. వీటిని టాటా గ్రూప్ సంస్థ కూడా తయారీ ఆపివేయడం జరిగిందట. ఇప్పుడు మళ్లీ ఈ నానో కారు గురించి ఒక న్యూస్ అయితే వైరల్ గా మారుతున్నది.


టాటా గ్రూప్ నానో ఎలక్ట్రిక్ కారును సైతం త్వరలోనే తీసుకురాబోతోందట. ఈ ఏడాది చివరి కల్లా వీటిని లాంచ్ చేసే విధంగా నానో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారుకు సంబంధించి ధర, మైలేజ్ ఫిచర్స్ విషయానికి సంబంధించి కూడా న్యూస్ అయితే వినిపిస్తున్నాయి.. నానో EV కారు హాచ్ బ్యాక్ మోడల్స్ లో రాబోతున్నదట.17KWH బ్యాటరీతో ఫుల్ చార్జింగ్ తో కలదట. అలాగే ఈ కారు మైలేజ్ విషయానికి వస్తే 200 నుంచి 220 కిలోమీటర్ల వరకు వెళ్తుందట.

R-12 ప్రొఫైల్ టైర్లతో పాటు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇందులో కలిగే ఉంటుంది. అలాగే ఈ కారు 3.3KW కలిగి ఉండడమే కాకుండా ఏసీ చార్జర్ మ్యూజిక్ సిస్టం తో పాటు రేర్ కెమెరాలు ఫ్రంట్ పవర్ విండోస్ తోపాటు పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్ కూడా కలవట. ఈ కారులో బేసిక్ ధర  రూ.5 లక్షల రూపాయలు ఉంటుందని సమాచారం. ఇందులోనే హై అండ్ ఫ్యూచర్స్ కలిగిన కారు మాత్రం 8లక్షల రూపాయలు ఉండవచ్చని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. చాలామంది నానో ఎలక్ట్రిక్ కారుని తీసుకురావాలని అడుగుతూ ఉన్న సందర్భంలోనే వీటిని తయారు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో 10 రకాల ఫిచర్స్తో ఈ టాటా నానో కారు రాబోతున్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: