ఇంజిన్ నుంచి నీళ్లు రావడానికి కారణమదే


వర్షాకాలం అయితే వస్తే చాలు వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిందే. అందులోనూ ముఖ్యంగా  కారు ఉన్నవారు. వర్షాకాలంలో కారులో సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కారు ఇంజిన్ నుంచి నీరు లీక్ అవుతుంటుంది. కారు నడిపేటప్పుడు కూడా రోడ్డుపై నీరు  పడుతూ ఉండటం పెద్ద సమస్యగా ఉంటుంది. ఇటువంటి సమస్యను ఎదుర్కొనేవారు చింతించాల్సిన అవసరం లేదు. కారు నుంచి నీళ్లు రావడానికి గల కారణాన్ని తెలుసుకోవడం మంచిది. ప్రధానంగా కారు నుంచి నీరు లీక్ అవ్వడం వెనక రెండు కారణాలు ఉంటాయి. వాటి ద్వారా పెద్ద నష్టమే జరిగే అవకాశం ఉంది.

ఇంట్లో ఎలాగైతే ఏసీ పనిచేస్తుందో కారులో కూడా అలాగే ఉంటుంది. ఇంటి ఏసీ నుంచి నీరు ఎలా వస్తుందో కారు ఏసీ నుంచి కూడా నీరు వస్తుంటాయని గమనించాలి. ఏసీ గాలి నుంచి హ్యూమస్‌ను తొలగించే ప్రక్రియలో పైపు ద్వారా కారు నుంచి నీరు బయటకు వస్తుంటుంది. అందుకే టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఒక వేళ కారును పార్క్ చేసి ఉంచినప్పుడు ఇంజిన్ షీల్డ్ పై పేరుకుపోయిన నీరు నెమ్మదిగా కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. కారు ఆపినప్పుడు అలా జరుగుతుంటుంది. ఇదంతా సాధారణంగా జరిగేదే. నీరు రావడం వల్ల ఏసీ సరిగ్గా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఏసీ లేనప్పుడు కూడా నీరనేది కింద పడుతూనే ఉంటుంది. వర్షాకాలంలో ఏసీ వాడకపోయినా కొన్ని సార్లు కారులోంచి నీళ్లనేవి వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తేమతో కూడిన బిందువులు వేడి ఇంజిన్ వల్ల నీరులా మారి బయటకు వస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. దీనివల్ల కారుకు ఏదైనా సమస్య వచ్చిందా అని చింతించాల్సిన పనిలేదు. చాలా మంది ఇంజిన్ ఫెయిల్ అయ్యిందని, అందుకే నీళ్లు వస్తున్నాయంటూ ఆందోళన చెందుతారు. అలాంటివారు ఈ విషయాలు తెలుసుకోవడం మరింత మంచిది. ఇంజిన్ నుంచి నీరు వస్తున్నాయంటే అది ఇంజిన్ రిపేర్ అని అర్థం చేసుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: