వాట్సాప్ వీడియో కాల్స్‌లో చూస్తే లుక్‌ని రియల్‌టైమ్ లోనే మార్చుకోవచ్చన్నమాట. అందుకు ఇకపై ‘ఫేషియల్ ఫిల్టర్స్’ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. అయితే వీడియో కాల్‌కి ముందు వాటిని అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా స్కిన్ ‘కలర్ టోన్’ మార్చుకోవచ్చు. అంతేకాదండోయ్ లొకేషన్, చుట్టూ ఉన్న లైటింగ్‌కు తగినట్లుగా బ్యాగ్రౌండ్‌లో కూడా మార్పులు చేయొచ్చన్నమాట. ‘బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ టూల్’తో వెనకున్నవన్నీ ఛేంజ్ చేసే అవకాశం ఉంది.
ఒక చోట ఉన్నప్పుడు ఆఫీస్ మీటింగ్ కాల్ వస్తే వెంటనే అందులో ఆఫీస్ బ్యాగ్రౌండ్‌ను సెట్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్‌కు సరదాగా కాల్స్ చేస్తుంటే వారికి ఇష్టం వచ్చిన బ్యాగ్రౌండ్ సెట్ చేసుకోని మాట్లాడుకోవచ్చు. వీటినే ప్రీసెట్ బ్రాగ్రౌండ్ అని అంటారు. ఒక వేళ వాటిని వద్దనుకుంటే ఉన్న బ్యాగ్రౌండ్‌నే బ్లర్ చేసుకుని వీడియో కాల్‌లో మాట్లాడవచ్చు. వీడియో కాల్స్‌లో వెలుతురు తక్కువైతే మాత్రం లోలైట్ మోడ్‌ని సెలెక్ట్ చేసుకుని లైటింగ్ అడ్జస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. టచ్ అప్ ఇచ్చేందుకు టచ్ అప్ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో వాట్సాప్ వీడియో కాల్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుంది. యాపిల్ యూజర్లకు అయితే ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.