ప్రస్తుతం అన్ని రంగాల్లో కూడా అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్న మనిషి ప్రతి పనిని కూడా ఎంతో సులభతరం చేసుకునేందుకు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే అటు బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ సరికొత్త టెక్నాలజీ అన్ని పనులను ఎంతో సులభతరం చేసింది.


 ఒకప్పుడు ఎలాంటి ఆర్థికపరమైన లావాదేవీ జరపాలి అన్న కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. బ్యాంకుకు వెళ్లి ఏకంగా గంటల తరబడి క్యూలో నిలబడి ఇలా డబ్బులు పంపించడం లేదంటే డబ్బులు తీసుకోవడం లాంటివి చేసేవారు. కానీ ఇప్పుడు యూపీఐ సర్వీస్ లు అందుబాటులో ఉన్న నేపథ్యం లో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచే ఎవరి అకౌంట్లో కైనా డబ్బులు పంపించ గలుగుతున్నారు. అదేవిధంగా డబ్బులను ఇతరుల నుంచి పొంద గలుగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి యూపీఐ సర్వీస్ లు అందిస్తున్న ప్రముఖ కంపెనీల లో ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ ముందు వరుసలో ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే తమ కస్టమర్స్ అందరికి కూడా మరింత నాణ్యమైన సర్వీస్ లు అందించడమే లక్ష్యం గా ఆయా కంపెనీలు వినూత్నమైన ఫీచర్లను అందుబాటు లోకి తీసుకు వస్తున్నాయి. ఒకవేళ మీరు గూగుల్ పే వాడుతున్నారు అంటే మీకు ఒక గుడ్ న్యూస్ అందింది. గూగుల్ పే సరికొత్తగా యూపీఐ సర్కిల్ ఫీచర్ను ఆవిష్కరించింది. ఇందులో లావాదేవీలు చేపట్టినప్పుడు కుటుంబీకులు, మిత్రుల బ్యాంక్ ఖాతాలను లింక్ చేయకుండానే వారిని సెకండరీ పార్టిసిపెంట్లుగా జత చేయొచ్చు  దీంతో చెల్లింపుల బాధ్యతను పాక్షికం / పూర్తిగా వారికి అప్పగించే అవకాశం యూజర్లకు దొరుకుతుంది. అంటే కుటుంబం లేదా బృందం కలిసి ఖర్చుల్ని మేనేజ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: