గత కొంతకాలంగా టెలికాం దిగ్గజ సంస్థలలో టాప్ లో కొనసాగుతున్న టెలికాం దిగ్గజ సంస్థ జియో నెట్వర్క్ నే చాలా మంది ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇటీవలే జియో ప్లాన్లను కూడా భారీగా పెంచేసింది. దీంతో యూజర్స్ సైతం చాలా ఇబ్బందులకు గురవుతున్నారట. సుమారుగా కొన్ని వందల రూపాయలు ఒకేసారి పెంచడంతో  చాలా మంది అసహనాన్ని తెలియజేస్తూ ఇతర నెట్వర్కులకు పోర్టబుల్టి అవుతున్నారు. బిఎస్ఎన్ కు ఎక్కువ కస్టమర్లు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జియోని చూసి ఎయిర్టెల్, వోడాఫోన్ ఇతర నెట్వర్క్ లు కూడా ప్లాన్లను పెంచేసినట్లు తెలుస్తోంది.


దీంతో యూజర్స్ ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ వైపుగా మగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో రీఛార్జ్ ప్లాన్స్ తక్కువగా ఉండడమే కాకుండా త్వరలోనే 4g ,5g సేవలను కూడా అందించే విధంగా బిఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకోబోతున్నారట. ఇలాంటి సమయంలోనే తాజాగా జియో యూజర్స్ కు ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. రీఛార్జి ప్లాన్స్ ధరలలో భారీ ఆఫర్లను కూడా ప్రకటించింది జియో.. జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా పలు రకాల ఆఫర్లను అందించారు.


ఈనెల 5వ తేదీ నుంచి 10వ తేదీన కొన్ని రీచార్జ్ ప్లాన్ల పైన ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించారు జియో సంస్థ.
1). రూ.899 రూపాయల ప్లాను 90 రోజులు
2).999 రూపాయల ప్లాన్ 98 రోజులు
3).3599 రూపాయల ప్లాన్ 365 రోజులతో రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే 700 విలువైన ప్రయోజనాలను కూడా అందించబోతున్నారట. అలాగే ఇందులో 10 ఓటీటీ లు అందించడమే కాకుండా మూడు నెలల పాటు జొమోటో గోల్డ్ మెంబర్షిప్ ని ఉచితంగా అందిస్తారు అలాగే రెండు వారాలపాటు వ్యాలిడిటీతో 175 విలువైన 10gb డేటా అని  ఓచర్ కూడా అందిస్తున్నారట. అయితే ఈ ఆఫర్లు కేవలం కొద్ది రోజులు ఉన్నట్లుగా తెలియజేస్తోంది జియో సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: