సాధారణంగా చాలామంది మొబైల్ తెచ్చిన కొత్తలో మాత్రమే కంపెనీ చార్జర్ తో చార్జింగ్ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత కొద్ది రోజులకి ఏ చార్జర్ తో అంటే ఆ చార్జర్ తో చార్జింగ్ చేస్తూ ఉన్నారు చాలా మంది. ముఖ్యంగా ఆఫీసులలో లేకపోతే ఎక్కడైనా టూర్లకు వెళ్లిన ఇతర చార్జర్లతో మొబైల్ ఛార్జింగ్ చేస్తూ ఉన్న విషయాన్ని మనం ఎన్నోసార్లు చూసే ఉంటాము. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదం అంటూ పలువురు టెక్ నిపుణులు  తెలియజేస్తున్నారు. మరి వాటి గురించి చూద్దాం.


స్మార్ట్ మొబైల్స్ ఇతర చార్జర్లకు ఎప్పుడూ కూడ మద్దతు ఇవ్వదు.. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మొబైల్స్ అన్ని కూడా చాలా సరికొత్త టెక్నాలజీ తోని అప్డేట్ తోనే వస్తూ ఉన్నాయి.. చాలా మొబైల్స్  18 వాట్స్ ,30 వాట్స్,45 వాట్స్ ఇలా చార్జింగ్ సపోర్ట్ తో ఇస్తున్నారు.. ఒకవేళ మనం ఇతరుల చార్జర్  ఉపయోగించే చార్జర్ 80 w కరెంట్ చార్జింగ్ అయితే.. మొబైల్ ఫోన్ కి వచ్చిన వాట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మొబైల్ డామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల బ్యాటరీ డామేజ్ కూడా జరుగుతుందట. ముఖ్యంగా మొబైల్ వేడెక్కడం లేదా పేలడం వంటిది జరుగుతూ ఉంటాయట. కొన్ని సందర్భాలలో మొబైల్ డెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.


అంతేకాకుండా ఒరిజినల్ చార్జర్ తో ఇంట్లోనే ఫుల్ ఛార్జింగ్ చేసుకొని వాడుకోవడం చాలా మంచిది. కంపెనీ ఇచ్చిన చార్జర్ తో చార్జింగ్ చేయకుంటే బ్యాటరీ సామర్థ్యం వెంటనే తగ్గిపోతుంది. దీనివల్ల ఎక్కువసేపు ఛార్జింగ్ కూడా నిలవదు.. అలాగే స్క్రీన్, హార్డ్వేర్ సమస్యలు కూడా మొబైల్ కి ఎదురవుతాయి. చార్జింగ్ తో మొబైల్ యూజ్ చేయడం గేములు ఆడడం వంటివి కూడ చాలా ప్రమాదం.. ఇలా రెండు పనులు ఒకేసారి చేయడం వల్ల మొబైల్ ఓవర్ హీట్ అవుతుంది. అందుకే మొబైల్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగానే ఉపయోగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: