నేటి ఆధునిక యుగంలో మనిషి టెక్నాలజి మీద ఎంతలా ఆధారపడుతూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఏ పని పూర్తి చేయడానికి అయినా ఇలాంటి టెక్నాలజీని వాడుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఒకప్పుడు ఎవరికైనా సమాచారాన్ని చేరవేయాలి అంటే కేవలం ఉత్తరాల ద్వారా మాత్రమే చేరవేసేవారు. కానీ ఇప్పుడు ఆ ఉత్తరమే వాట్సాప్ గా మారిపోయింది. ఇక ఏ సమాచారం చేరవేయాలి అన్న వాట్సాప్ ద్వారానే మెసేజ్లను పంపిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.


 ఒకరిని ఒకరు చూసుకోవాలన్న ఒకరిని ఒకరు కలుసుకోవాలన్న వాట్సాప్ లో కాల్ మాట్లాడుకోవడం వాట్స్అప్లో వీడియో కాల్ లో ఒకరిని ఒకరు చూసుకోవడం చేస్తున్నారు. అంతలా నేటి రోజుల్లో వాట్సప్ వాడేస్తూ ఉన్నారు. ఇక మన దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అటు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకువస్తూ తమ కస్టమర్ల పెంచుకుంటూ వస్తుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. వాట్సాప్ ఇక ఈ ఫీచర్ తో అందరూ అందంగా మారబోతున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కెమెరా ఎఫెక్ట్స్ పేరిట కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో యాప్ లో కెమెరాతో ఫొటోస్ వీడియోస్ తీసేటప్పుడు ఫిల్టర్స్ వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. వీడియో కాల్స్ లో కూడా ఈ కొత్త విజువల్ టూల్స్ ఉపయోగించవచ్చు. ప్రస్తుతం కొందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మిగతా యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వస్తుంది అంటూ వాట్సప్ తెలిపింది. అయితే ఇప్పటికే పలు మెసేజింగ్ యాప్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కానీ వాట్సాప్ లో మాత్రం ఈ ఫీచర్ అందుబాటులో లేకపోవడంతో యూసర్లు కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: