ల్యాప్ టాప్ వినియోగించే వారి సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. ఎక్కువమంది వీటి వినియోగం ఎక్కువగా ఉండడం చేత సరికొత్త ఫీచర్స్ తో రూపొందించిన ల్యాప్ టాప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ల్యాప్ టాప్ కొనాలి అంటే కచ్చితంగా రూ .40 నుంచిరూ .50 వేల రూపాయలు పైన ధరకి కొంటేనే మంచి ఫీచర్స్ తో వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి కేవలంరూ .10000 కంటే తక్కువ ధరకే కొన్ని బెస్ట్ ల్యాప్ టాప్స్ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో ఇవి అందుబాటులోకి వచ్చాయట.సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఈ ఆఫర్లు పలు రకాల ఈ కామర్స్ సంస్థల్లో ఆఫర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.


1).HP CHORME BOOK:
11.6 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో..8 కోర్ మీడియా టెక్ MT 8183 ప్రాసెస్ పాటుగా 4GB RAM+32 GB స్టోరేజ్ తో ఉన్నది. మైక్రో ఎస్ దీని కూడా ఉపయోగించుకోవచ్చు. వైఫై, బ్లూటూత్.. యుఎస్బి టైప్ సి పోర్టులు కూడా ఉపయోగించుకోవచ్చు..16 గంటల బ్యాటరీ బ్యాకప్ తో కలదు. ఈ ల్యాప్ టాప్ కేవలం 9,900 రూపాయలకే అందుబాటులో ఉన్నది. ఇతర కార్డుల ద్వారా డిస్కౌంట్లు కూడా కలిగి ఉన్నాయి.


2).HP TOUCH CHORME BOOK:
8183 మీడియా టెక్ MT ప్రాసెస్ తో టచ్ ల్యాప్ టాప్ పనిచేస్తుంది..11.6 అంగుళాల హెచ్డి డిస్ప్లేని కలిగి ఉంటుంది.4gb ram+32 స్టోరేజ్ తో కలదు. బ్లూటూత్, యూఎస్బీ టైప్-C  కలిగి ఉండడమే కాకుండా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ల్యాప్ టాప్ నీ తయారు చేశారట.


3) acer CHORME BOOK:
బ్రౌజింగ్, సిష్టమ్ ఇతరత్రా అవసరాల కోసం ఈ ల్యాప్ టాప్ చాలా ఉపయోగపడుతుంది.4500 ఇంటెల్ డ్యూయల్ కోర్ ప్రాసెస్ తో కలదు..4gb+125 gb స్టోరేజ్ తో కలిగి ఉంటుంది. అదిరిపోయి ఫీచర్స్ తో పాటు.. గూగుల్ అసిస్టెంట్, ఆటోమేటిక్ అప్డేట్, బ్లూటూత్ కనెక్టివిటీ ,వైఫై తో పాటుగా.. 10 గంటల బ్యాటరీ బ్యాకప్ కూడా కలదు దీని ధర 14000 కలదు.


ఇవే కాకుండా asus vivo Book E-12, altimus Pro వంటి లాప్టాప్ లు కూడా 15 వేల రూపాయల లోపే లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: