మరి కొంతమంది గూగుల్ ప్లే స్టోర్, లేదా గూగుల్ నుంచి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ని సైతం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా యాప్స్ ఉపయోగించడం చాలా ప్రమాదమని దీనివల్ల మీ డేటా మొత్తం ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి యాప్స్ ల వల్లే నెక్రో ట్రోజన్ వైరస్ వ్యాపింప చేసేలా చేస్తున్నారట. ఈ వైరస్ వల్ల మీ మొబైల్ లో కొన్ని అన్ వాంటెడ్ యాడ్స్ ని కూడా వస్తూ ఉంటాయట . కేవలం రెండు యాప్స్ వల్ల ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు టెక్నిపుణులు తెలుపుతున్నారు.
అందులో ఒకటి వూటా కెమెరా (VUTA CAMERA), మరొకటి మ్యాక్స్ బౌజర్ (MAX BROWSER) వంటి యాప్స్ చాలా ప్రమాదకరమని ఈ రెండు ఉంటే కచ్చితంగా ఎవరైనా అన్ ఇన్స్టాల్ చేయడం మంచిదట. ఎందుకంటే ఈ రెండు యాప్స్ వల్లే చాలా వైరస్ ని ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. వూటా కెమెరా అనే యాప్ ని రెండు కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకుంటున్నారట.మ్యాక్స్ బ్రౌజర్ అనేది సుమారుగా 4 లక్షల మందికి పైగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అందుకే ఎవరైనా మొబైల్లో ఉంటే వీటిని డిలీట్ చేయడం మంచిది.