నేటి ఆధునిక జీవనశైలిలో ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి ప్రతి మనిషి జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించకుండా మనిషి ఏ పనిని పూర్తి చేయలేకపోతున్నాడు. చివరికి కనీసం వంట చేసుకోవాలి అన్న కూడా ఎక్కువ మొత్తంలో జనాలు ఇలాంటి ఎలక్ట్రానిక్ మిషిన్ల మీద ఆధారపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో చాలా మంది కూరగాయలను ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంచుకోవడం కోసం, ఆహారం త్వరగా చెడిపోకుండా ఉంచుకోవడం కోసం రిఫ్రిజిరేటర్లను వాడటం చూస్తూ ఉన్నాం.


 నేటి రోజుల్లో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో కూడా ఇలాంటి రిఫ్రిజిరేటర్లు కనిపిస్తున్నాయి అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు రిఫ్రిజిరేటర్ ఉపయోగించినప్పటికీ ఆహారం మాత్రం చెడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలని ఎంతో మంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే రిఫ్రిజిరేటర్లలో ఉండే ఒక బటన్ ఇక ఇలాంటివి కంట్రోల్ చేస్తుందట. ఈ బటన్ అన్ని ఫ్రిడ్జ్ లలో ఉంటుంది. కానీ చాలామందికి దీని గురించి తెలియదు.


 అయితే ఇలా రిఫ్రిజిరేటర్ లో ఉండి ఒక రహస్యమైన బటన్ ను ఉపయోగిస్తే ఆహారాన్ని ఎక్కువ సేపు తాజాగా ఉంచేందుకు అవకాశం ఉంటుందట. ప్రతి ఒక్కరి రిఫ్రిజిరేటర్ లో ఉష్ణోగ్రత బటన్ ఉంటుంది. కానీ దానిని సరైన ఉపయోగం ప్రజలకు తెలియజేయాలి. ఇది సాధారణంగా సున్నా నుంచి ఐదు సంఖ్యలను కలిగి ఉంటుంది. అయితే ఇది రిఫ్రిజిరేటర్ లోపల ఉష్ణోగ్రతను నిర్ణయిస్తుంది. చాలామంది వ్యక్తులు దీనిని డిగ్రీల సెల్సియస్ తో చూస్తూ ఉంటారు. కానీ ఇది ఫ్రిడ్జ్ సామర్ధ్యాన్ని చూపిస్తూ ఉంటుందట. ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ప్రకారం  రిఫ్రిజిరేటర్ ను 5C కంటే తక్కువ ఉంచాలి. ఎందుకంటే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. 8 సి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే ఆహారం పాడుతూ ఉంటుంది. అందుకే ఇక ఈ రహస్య బటన్ ను ఉపయోగించి కూరగాయలను ఎప్పుడు తాజాగా ఉంచుకునే ప్రయోజనం పొందవచ్చు అంటూ సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: