రిలయన్స్ జియో భారత్ సిరీస్ లో భాగంగా v -3,V-4 మొబైల్ ను ఆవిష్కరించింది.. ప్రస్తుతం అంతా 4G  డిజిటల్ యుగం వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు. కీప్యాడ్ మొబైల్స్ కూడా ఈ మధ్యకాలంలో 4G మొబైల్స్ ని విడుదల చేస్తూ ఉన్నాయి పలు రకాల సంస్థలు. తాజాగా జియో భారత్ సిరీస్ నుంచి విడుదలైన ఈ మొబైల్స్ రూ.1099 రూపాయలు మాత్రమే ఉన్నదట. V-3,V-4  మోడల్స్ త్వరలోనే ఫిజికల్ మొబైల్ సెల్లింగ్ లోనే కాకుండా జియో మార్ట్ అమెజాన్ లో కూడా తీసుకురాబోతున్నారట.


అలాగే 40 శాతం తక్కువతో పాటుగా జియో భారత్ సిరీస్ మొబైల్ తో పాటుగా రూ .123 రూపాయల ప్లాన్ రీఛార్జిని కూడా అందిస్తుందట. ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ వాయిస్ కాల్, 14 జిబి ఇంటర్నెట్ ని పొందవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే..1000 MAH సామర్థ్యంతో కలదు. ఈ మొబైల్ 125 జీబి వరకు స్టోరేజ్ ని పెంచుకునే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ మొబైల్ 23 భారతీయ భాషలను కూడా సపోర్టు చేస్తుందట. ఎక్కడికి వెళ్లినా ఉపయోగించుకోవచ్చు.


V-3,V4 ఈ రెండు మొబైల్స్ వల్ల యూజర్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ని కూడా పొందవచ్చట.. జియో టీవీ వినియోగదారులు కూడా ఇందులో తమకు ఇష్టమైన వాటిని గేమ్స్ ని అన్నిటినీ కూడా వీక్షించుకోవచ్చు. అలాగే 455 చానల్స్ ని  ఉచితంగా చూడవచ్చట. అలాగే జియో పే, యూపీఐ ఇంటిగ్రేషన్, డిజిటల్ పేమెంట్స్ సులభంగా చేసుకోవడానికి ఈ మొబైల్ చాలా ఉపయోగపడుతుందట. జియో చాట్ యూజర్స్ కూడా అన్లిమిటెడ్ మెసేజింగ్ ని ఇందులో పొందవచ్చు అలాగే గ్రూప్ చాట్ అంటే ఆప్షన్లు కూడా ఇందులో లభిస్తాయట .దీని ద్వారా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో ఈజీగా కనెక్టింగ్ గా ఉండవచ్చు. మరి ఈ కీప్యాడ్ మొబైల్ ఏ విధంగా పాపులర్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: