ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగానే చాలా మంది విద్యార్థులు, యువత ,ఉద్యోగస్తులు ఎక్కువగా కంప్యూటర్లు ల్యాప్ టాప్స్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే చాలా మంది కీ బోర్డుని ఉపయోగించేటప్పుడు కీబోర్డ్ లో కొన్ని ప్రత్యేకమైన సింబల్స్ ఉంటాయి.. అయితే కీబోర్డులో F-J అక్షరాల మీద చిన్న అడ్డగీతలు చాలా మంది వీటిని గమనించకపోవచ్చు.. అయితే వాటిని అలా ఎందుకు డిజైన్ చేశారని విషయం చాలామందికి కూడా తెలియకపోవచ్చు.ఇప్పుడు వాటి గురించి చూద్దాం.


F-J బటన్స్ పైన ఉన్న ఈ అడ్డగీత టైపింగ్ చేయడంలో చాలా కీలకంగా మారుతుందట.. వాస్తవానికి ఈ లైన్ యొక్క ఉద్దేశం టైపింగ్ వేగాన్ని పెంచడంతో పాటుగా కీబోర్డ్ చూడకుండానే టైపింగ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయట. ముఖ్యంగా ఎడమ చేతి చూపుడు వేలు దగ్గర F బటన్ పైన ఉంచాలి.. ఆ తర్వాత కుడి చూపుడు వేలును J బటన్ పైన ఉంచినట్లు అయితే టైపింగ్ నేర్చుకోవడానికి చేయడానికి కావడం చాలా సులభంగా ఉంటుందట. మిగిలిన వేళ్ళతో చాలా సులువుగా టైపింగ్ చేయవచ్చు. ఇలా వీటిని టైపింగ్ చేయడానికి కీబోర్డు పైన ఈ అక్షరాల మీద ఈ గుర్తులను ఉంచారట.


అయితే చాలా మందికి F-J బటన్స్ పైన ఎందుకు ఈ స్పెషల్ గీతలను అమర్చారు అనే విషయం అందరికీ సందేహంగా ఉండవచ్చు. అయితే అందుకు గల కారణం ఆ బటన్ల యొక్క స్థానం కీబోర్డ్ లకు కచ్చితంగా మధ్యలో ఉంటాయి కనుక వాటి చుట్టూ ఉన్న బటన్లను ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉన్నాము.. కాబట్టి ఈ బటన్లను అక్కడ ఉంచారట. టైపింగ్ చేయడానికి కూడా చాలా సులువుగా ఉంటుందనీ F-J బటన్స్ కి ఈ స్పెషల్ గీతలను ఇచ్చారట. ఇవే కాకుండా కీబోర్డ్ పైన కూడా చాలానే కొన్ని ప్రత్యేక మైన సింబల్స్ తో పాటు షార్ట్ కట్ కీస్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: