రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జియోతో భారీగా యూజర్స్ ని సంపాదించుకొని కోట్ల రూపాయల సంపాదించారు. అయితే ప్రస్తుతం అంబానీకి ఎదురుదెబ్బ తగులుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర టెలికాం సంస్థలతో దీటుగా పోటీపడి అతి తక్కువ సమయంలోనే ఆఫర్లతో కస్టమర్లను బాగా ఆకట్టుకున్న జియో ప్రస్తుతం బీటలు బారుతోందనే విషయాలు గణాంక లెక్కల ద్వారా తెలుస్తున్నాయి. నిజానికి అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం తర్వాత ఎక్కువగా ఎదురు దెబ్బలు తగులుతున్నట్లు సమాచారం.


తన చిన్న కుమారుడు వివాహం ఆనంతరం జియో రీఛార్జ్ ప్లాన్లను అమాంతరం పెంచడంతో చాలామంది ట్రోల్ చేయడం కూడా జరిగింది. ఇలా జియో పెంచడంతోపాటుగా ఇతర టెలికాం సంస్థలు కూడా చార్జీలు పెంచేశాయి. చాలామంది జియో నుంచి బిఎస్ఎన్ఎల్ కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చాలా తక్కువ ఖర్చుకి ప్రభుత్వ సేవలను సైతం పొందడానికి జియో యూజర్స్ ఒక్క సారిగా అటువైపుగా వెళ్లడం జరిగింది. జియో టారిప్ రేట్లు పెంచడం  మైనస్ గా మారిందట.. సెప్టెంబర్ రెండవ వారంలో సుమారుగా 10,900,000 మంది వినియోగదారులు జియో నెట్వర్క్ ని వీడడం జరిగిందట.


ఇంతమంది జియో కస్టమర్లు వీడడం అంటే అది జియోకు భారీ దెబ్బ అని చెప్పవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి జియో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్న వినియోగదారులు మాత్రం మారుతూనే ఉన్నారట. ప్రస్తుతం ఫ్రై చేసేవాళ్లను ఇతర నెట్వర్కుల కంటే దేశవ్యాప్తంగా పరిచయం చేసిన జియో గతంలో 1.30 కోట్ల నుంచి 17 లక్షలకు పెరిగారు.. దీంతో సుమారుగా 1.47 కోట్లకు చేరుకున్నట్లు జియో సంస్థ వెల్లడించింది. అయితే వీరంతా కేవలం 5జి నెట్వర్క్ ని అందించడం పైనే వచ్చారని పంపిణీ దృష్టికి వెళ్లిందట.. ప్రస్తుత తగ్గుతున్న యూజర్స్ సంఖ్యని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో యూజర్స్ ని తిరిగి పొందడానికి కొత్త ఆఫర్లను లేదా రీఛార్జ్ ప్లాన్లను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: