ముఖ్యంగా గీజర్ ని నిరంతరం రన్ చేస్తూ లేదా ఆఫ్ చేయడం మర్చిపోవడం వల్ల చాలా ప్రమాదం జరుగుతుందట. ఎక్కువ వేడి ఎక్కడం వల్ల పేలుడుకు కారణం అవుతుందని తెలియజేస్తున్నారు. గీజర్ ధర్మామీటర్ కరెక్ట్ గా పని చేస్తుందో లేదో చెక్ చేస్తూ ఉండాలి.
గీజర్ లోపల ఒత్తిడి పెంచడానికి సేఫ్టీ వాళ్ళు అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకే వీటిని తరచూ చెక్ చేస్తూ ఉండాలి. గీజర్ లోపల ఒత్తిడి ఎక్కువగా గురైనప్పుడే పేలే అవకాశం ఉంటుందట.
గీజర్ ని ఎక్కువకాలం వాడకుండా అలాగే ఉంచకూడదు. కనీసం వారంలో ఒక్కసారైనా వాటిని ఉపయోగిస్తూ ఉండాలి. గీజర్ పాతది అయినా లేదా ఏదైనా ఇబ్బందులు తలెత్తిన రిపేరు చేయించడం కంటే కొత్తది తీసుకోవడం ఉత్తమమట. ముఖ్యంగా ధర్మోస్ స్టార్ట్ సమస్య ఉంటే చాలా ప్రమాదం ఎదురవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
గీజర్ ని ఉపయోగించేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తూ ఉండాలి.. ఎందుకంటే గీజర్ నుండి నీరు లీకైన లేదా వేడెక్కడం వంటి సమస్యలు ఎదురైతే విద్యుత్ షాక్ కు గురవుతారు. దీనివల్ల మనిషికి కూడా చాలా ప్రమాదం ఎదురవుతుంది. గీజర్ ని ఎప్పుడు కూడా కాస్త గాలి ఆడే ప్రదేశంలో ఉంచడం ఉత్తమం. దీనివల్ల గీజర్ ఎక్కువగా వేడి అవ్వకుండా ఉంటుంది. కరెంటు ఎత్తుతగ్గులు వచ్చినప్పుడు కూడా గీజర్ ని ఉపయోగించకపోవడమే మంచిది.