సిమ్ కార్డు లేకుండానే కాల్స్ మెసేజ్ చేసేలా ఒక సరి కొత్త టెక్నాలజీని బిఎస్ఎన్ఎల్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీంతో నెట్వర్క్ లేకపోయినా కూడా విపత్తులు, సముద్ర మార్గాల ద్వారా ప్రయాణించిన.. ఏదైనా మారుమూల ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ సేవలను పొందే విధంగా ఉండేలా కస్టమర్లకు ఇలాంటి సదుపాయాన్ని త్వరలోనే తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తొందట. అందుకోసం డైరెక్ట్ టు డివైస్ టెక్నాలజీ కోసం..US చెందిన వైయాశాత్ తో కలిసి చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
దీనివల్ల శాటిలైట్ ప్రాంతీయ మొబైల్ నెట్వర్కులను సైతం లింకు చేసుకొని మరి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లు నడుస్తాయట. ఇది సక్సెస్ అయితే సాటిలైట్లే సెల్ఫోన్ టవర్లుగా మారుతాయని సమాచారం. ఇది సక్సెస్ అయ్యిందంటే.. ఇతర నెట్వర్కులన్నీ కూడా చుక్కలు కనపడడం ఖాయమని చెప్పవచ్చు. అది తక్కువ ధరకే బిఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్లను అందించడమే కాకుండా ఇలాంటి సదుపాయాలు అందిస్తూ ఫైవ్జి నెట్వర్క్ లను తీసుకువస్తే ఖచ్చితంగా కస్టమర్లు పెరిగి అవకాశం ఉంటుంది ఇప్పటికే జియో నుంచి సుమారుగా 50 లక్షల మందికి పైగా కస్టమర్లు సైతం బిఎస్ఎన్ఎల్ వైపుగా మారినట్లు తెలియజేసింది. అలాగే ఎయిర్టెల్ నుంచి కూడా పోర్ట్ అవ్వడానికి చాలామంది మక్కువ చూపుతున్నారట. మరి రాబోయే రోజుల్లో బిఎస్ఎన్ఎల్ హవానే ఎక్కువగా ఉంటుందేమో చూడాలి మరి. ఈ విషయం పైన బిఎస్ఎన్ఎల్ క్లారిటీ ఇస్తుందేమో తెలియాల్సి ఉంది.