ట్యూబ్ లెస్ టైర్ల విషయానికి వస్తే. ఈ టైర్లకి లోపల ట్యూబు లేనందువలన పంచర్ అవ్వడానికి చాలా తక్కువగానే అవకాశం ఉంటుంది. చిన్న పంచర్ అయినా సరే కేవలం లిక్విడ్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ టైర్లు కలిగి ఉన్న వాహనాలు పంచారైనా సరే ఎలాంటి నష్టం లేకుండా డ్రైవింగ్ చేసుకొని ముందుకు వెళ్ళవచ్చు. ట్యూబ్ లెస్ టైర్లలో ట్యూబ్ లేకపోవడం వల్ల ప్రమాదాలు కూడా చాలా తక్కువగానే జరుగుతూ ఉంటాయి. ట్యూబ్ లెస్ టైర్లు చాలా తట్టుకో అయినా ఒత్తిడితో నడుస్తూ ఉంటాయట. ఎలాంటి రోడ్లలోనైనా సరే మెరుగైన రీతిలో వెళతాయి. ఈ టైర్లలో గాలి పీడనం తక్కువగా ఉన్న సరే జోరుగా ముందుకు వెళ్తుంది. ట్యూబ్ టైర్ల కంటే ఇది కొంత ఖరీదైనది.
పెద్ద పంచార్స్ అయితే వీటిని సరి చేయడం చాలా కష్టమే సైడ్ వాల్ నష్టం కూడా జరుగుతుందట. కొన్ని వాహనాలకు మాత్రమే ట్యూబ్ లెస్ టైర్లు అనుకూలంగా ఉండవు..
ట్యూబ్ ఉండే టైర్ల యొక్క ప్రయోజనం విషయానికి వస్తే. ధర కూడా చాలా తక్కువగానే ఉంటాయి. వాహనాలకు అవసరమైన ఎంపికతో చేసుకోవచ్చు. ట్యూబ్ టైర్లను సులువుగా మనమే పంచారు వేసుకోవచ్చు. వీటి యొక్క రిములు దాదాపుగా అన్ని వాహనాలకు సరిపోతాయి. అంతేకాకుండా వీటికి సంబంధించిన అన్ని సామాగ్రి కూడా ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది.
ట్యూబ్ టైర్లు పంచర్లు అవడం, పేలడం వంటివి జరుగుతూ ఉంటాయి.. గాలి తక్కువగా ఉంటే కచ్చితంగా ట్యూబ్ దెబ్బతిని రాపిడికి కారణమవుతుంది. ట్యూబ్ పంచార్ వేయాలి అంటే కొంతమేరకు సమయం కూడా పడుతుంది.
ట్యూబ్ లెస్ టైర్లు ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటి కాలం కూడా ఎక్కువగానే వస్తుంది.. అంతేకాకుండా పంచరైన మనం సాధారణంగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని సామాగ్రిని తీసుకొని వేసుకోవచ్చు. ట్యూబ్ టైర్లు కూడా మెరుగైన వాటితోనే లభిస్తాయి. ఇవి సరసమైన ధరలకే కూడా లభిస్తూ ఉంటాయి. వీటిని రిపేర్ చేసుకోవడం కూడా సులువే.. ట్యూబ్ లెస్ టైర్లు అనుకూలంగా లేని వాహనాలకు ట్యూబ్ టైర్లను ఉపయోగించుకోవడమే మంచిది.