ముఖ్యంగా హోండా యూనికార్న్ బైక్ డిజైన్లు చాలా మార్పులను చేశారట. కూల్ స్ఫూర్తి కమ్యూనిటీ ఓరియంటల్ డిజైన్ కలిగి ఉంటుందట. ముఖ్యంగా ఈసారి మూడు కలర్స్ ఆప్షన్లు రాబోతున్నదట.
హోండా యూనికార్న్ ఇంజన్ విషయానికి వస్తే 162.71సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో ఉన్నది అయితే ఇప్పుడు అప్గ్రేడ్ గా OBD2B నిబంధనలకు అనుగుణంగానే రాబోతున్నదట. ఈ మోటారు 13 BHP పవర్ తో పాటు ఫైవ్ స్పీడ్ గేర్ తో పాటుగా..14.58 NM టార్కును ఉత్పత్తి చేస్తుందట.
హోండా యూనికార్న్ బైక్ లో సరికొత్త ఎల్ఈడి హెడ్ లాంప్ ని అప్డేట్ చేసినదట.పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కనెక్షన్తో అప్డేట్ చేసినట్లు సమాచారం. అలాగే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇలా అన్నిటినీ కూడా కలిగి ఉంటుందట.. అలాగే యుఎస్బి -C చార్జింగ్ సపోర్టుతో రాబోతోందట.
హోండా యూనికార్న్ హార్డ్వేర్ లో కూడా చేంజ్ చేసిందట.. ముఖ్యంగా టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్స్ తో పాటు బ్రేకింగ్ సెటప్ లో 17 అంగుళాల చక్రాల పైన ఫ్రంట్ డిస్క్ ని అమరచారట. అలాగే వెనుక వైపు డ్రంమ్ బ్రేక్స్ కూడా ఉన్నాయట.2025 లో రాబోతున్నటువంటి యూనికార్న్ బైకు ధర ఈసారి 8,180 రూపాయల వరకు పెరిగిందట దీంతో మొత్తం మీద ఈ బైకు ధర ఎక్స్ షోరూం..1,11,301 రూపాయలుగా ఉన్నదట. మొదట ఢిల్లీ నుంచి ఈ బైక్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.