నేటి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం అనేది మనిషికి తప్పనిసరి అయిపోయింది. దాదాపు దశాబ్దకాలం కిందట కీపేడ్ ఫోన్లే సరిగ్గా ఉండేవి కాదు. ఒకవేళ అలాంటి ఫోన్ ఎవరిదగ్గరైనా ఉంటే, వారు సమాజంలో మంచి హోదాలో ఉన్నట్టు పరిగణించేవారు. కానీ ఇపుడు దానికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. దేశంలో బతికున్న ప్రతీ మనిషి స్మార్ట్ ఫోన్ అనేది వాడుతున్నాడు. ఇక మనదగ్గర ఇంటర్నెట్ చాలా చీప్ కావడంతో జనాలు స్మార్ట్ ఫోన్ వాడకాన్ని బాగా అలవాటు చేసుకున్నారు. అలవాటు అనేకంటే ఎక్కువశాతం మంది దానికి  బానిసలుగా అయిపోయారు అని చెప్పుకుంటే సబబుగా ఉంటుందేమో అన్నట్టుగా పరిస్థితి ఉంది.

ఈ క్రమంలోనే ఇపుడు మనిషి స్మార్ట్ ఫోన్ అనేది లేకుండా జీవించడం కష్టంగా మారింది. ఉదయం నిద్ర లేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్ తోనే మనిషి జీవిస్తున్నాడు. ఒక్క నిమిషం కూడా స్మార్ట్ ఫోన్ లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. మనుషులతో కంటే కూడా సెల్ ఫోన్లతోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అధికంగా ఉపయోగిస్తే అన్ని నష్టాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు జనాలను హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఇటీవల జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

విషయం ఏమిటంటే, జనాలు స్మార్ట్ ఫోన్ ను రోజుకు సగటున 344 సార్లు కంటే ఎక్కువగా చూస్తున్నారని చెబుతున్నారు. అంటే ప్రతి 4 నిమిషాలకు ఒకసారి సెల్ ఫోన్ చూస్తున్నట్టే లెక్క. ఈ క్రమంలో నోటిఫికేషన్ రాకున్నా కూడా ఊరికే మొబైల్ ఫోన్ తీసి చూడటం పరిపాటిగా మారింది. పదే పదే ఇలా సెల్ ఫోన్ చెక్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మైండ్ కేవలం సెల్ ఫోన్ మీద తప్ప మరే ఇతర పని మీద పూర్తి స్థాయిలో నిమగ్నం కావటం లేదని గుర్తించారు. ఇక అన్నింటికంటే స్మార్ట్ ఫోన్ ఎక్కువ ఉపయోగించడం వల్ల కొత్త రకం ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు సర్వేలో తేలింది. మెదడులో చురుకుతనం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి క్షీణించడం, మెదడు మొద్దుబారిపోవడం వంటివి జరుగుతున్నట్టు బయటపడింది. అందుకే రోజులో ఎంత వీలైతే అంత తక్కువగా స్మార్ ఫోన్లను వినియోగించడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: