మనం ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డుమీద మనకు చాలా రాళ్లు కనిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా ఎక్కువగా కిలోమీటర్ల రాళ్లను చాలామంది అనుసరిస్తూ ఉంటారు. హైవేల పైన ఈ రాళ్లు ఏర్పాటు చేయడం కూడా మనం గమనించవచ్చు. ఏదైనా ఒకచోట నుంచి మరొక చోటికి ప్రయాణించేటప్పుడు ఇవి చాలా రకాలుగా సహాయపడతాయి. ముఖ్యంగా ఈ రాళ్ళని ఎంత దూరం ఉందనే విషయాన్ని తెలియజేస్తాయి. అయితే ఈ రాళ్లు కొన్ని కొన్ని సార్లు రంగులను మారుస్తూ ఉంటారు. ఎవరైనా వేకేషన్స్ టూర్స్ కి వెళ్లే వారికి ఈ రాళ్ల రంగులను గుర్తించుకోవడం వల్ల ఉపయోగపడతాయి. అలా రాళ్లు రంగు వెనక ఉన్న విషయం ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.



1). పసుపు రంగు మైలురాయి:
ఈ రాయి జాతీయ రహదారి పైన ప్రయాణిస్తున్నట్లుగా సూచిస్తుందట.. అయితే ఇది నగరాలు మరియు రాష్ట్రాల మధ్య సంబంధాన్ని కూడా సూచిస్తుందట.

2). కుంకుమ/నారింజ రంగు:
కాషాయ రంగులు ఉండేటువంటి ఈ మైలురాయి గ్రామీణ రోడ్డు పైన ప్రయాణిస్తున్నట్లుగా గుర్తించుకోవాలట. ఈ రోడ్డుని pmgsy,jry వాటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు కింద ఈ రోడ్డులను సైతం నిర్మించి ఉంటారట. ఈ రంగు గల రాళ్లు ఉంటే కచ్చితంగా ఇది గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన రోడ్డుగా గుర్తించాలి.


3). నలుపు లేదా నీలిరంగు మైలురాయి:
నలుపు నీలిరంగు లేదా తెలుపు రంగులో ఉన్న మైలురాళ్లను నగరము లేదా ఏదైనా జిల్లా రోడ్ల పైన మన ప్రయాణిస్తున్నట్లుగా సూచిస్తాయట.


4). ఆకుపచ్చ మైలురాయి:
ఈ రంగు కలిగిన మైలురాళ్లు రాష్ట్ర రహదారుల పైన ప్రయాణిస్తున్నట్టుగా సూచిస్తాయట. అలాగే ఈ రాళ్లు కలిగి ఉన్న ప్రాంతాలలో దగ్గరలోనే నగరం కూడా ఉంటుందట.

కొన్ని రాష్ట్రాలలో కొన్ని రాళ్లు చాలా ప్రత్యేకమైన భాషలతో కూడా రాసి ఉంటారు. మనదేశంలో రాష్ట్ర రహదారులు మరియు ఎక్స్ప్రెస్ హైవే లతో సుమారుగా 58.98 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డు మార్గం ఉన్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: