ఈమధ్య రీఛార్జి ప్లాన్స్ చేసుకోవాలంటే సామాన్యులు సైతం భయభ్రాంతులకు గురైయ్యేలా అత్యధిక ధరలు పెరిగిపోయాయి. అయినా కూడా వినియోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూనే ఉన్నది. దీంతో ఇలాంటి వాటి అన్నిటికి చెక్ పెట్టే విధంగా TRAI సరికొత్త నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 2G సేవలను ఉపయోగించుకునే యూజర్స్ సుమారుగా 150 మిలియన్ల భారతీయులు ఉన్నారని వీరందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త మార్గదర్శకాలను సైతం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.



కేవలం వాయిస్ కాల్స్, SMS వంటి వాటికోసం మాత్రమే మొబైలను ఉపయోగించుకునేవారికి ఇది చాలా ఉపయోగపడుతుందట.. ముఖ్యంగా కీప్యాడ్ మొబైల్స్ లేదా 2G మొబైల్స్ ని ఉపయోగించేవారు డేటాతో అవసరం ఉండదు. అయినప్పటికీ కూడా వారు రీఛార్జ్ చేసుకోవాలి అంటే కచ్చితంగా డేటాను కలిపి రీచార్జ్ చేసుకోవాలనే విధంగా ఇప్పటివరకు ప్లాన్లను టెలికాం దిగ్గజ సంస్థలు తీసుకోవచ్చాయి. కానీ నిబంధనల ప్రకారం ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్ ఇతరత్రా టెలికాం సంస్థలకు రూ .10 రూపాయల ప్రారంభం నుంచి టాప్ అప్ అందరికీ ఓచర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటే TARI కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందట.



పది రూపాయలు రీఛార్జ్తోపాటుగా 10 రూపాయల డామినేషన్కు కట్టుబడి ఉండాల్సి ఉంటుందట. ప్రత్యేక టారిఫ్ ఓచర్లను చెల్లుబాటు అయ్యేందుకు 90 రోజుల నుంచి 365 రోజులు వరకు పెంచింది.. ఇంటర్నెట్ అవసరం లేనటువంటి 2g ఫ్యూచర్ కలిగి ఉన్న మొబైల్స్ వినియోగదారులకు ఇది ప్రత్యేకంగా ఉంటుందట.. ట్రామ్ మార్గదర్శకాలను  అమలులోకి తీసుకురావడానికి టెలికాం కంపెనీలకు కొన్ని వారాలపాటు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అందుకు  సంబంధించి అధికారికంగా లాంచింగ్ తేదీ ఈనెల చివరిలో కూడా వచ్చేలా ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సామాన్యులకు కూడా రీఛార్జి ప్లాన్స్ అందుబాటులో ఉండేలా TARI తీసుకురాబోతోంది. మరి ఇది ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: