అలాగే బ్యాటరీల ద్వారా నడిచే వాహనాలకు కూడా ఇప్పుడు ఎక్కువగా ప్రజలు మక్కువ చూపుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్లకు చార్జింగ్ చేయాలి అంటే కచ్చితంగా కరెంటు ఉండాల్సిందే.. దీనివల్ల రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు విషయంలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటికీ పోటీగా సౌర శక్తితో నడిచే కారుని సైతం వేవ్ సంస్థ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అది కూడా రూ.3.25 లక్షల రూపాయలకి ఎక్స్ షోరూం ధర నుంచి విడుదల చేసిందట.
అయితే ఈ సోలార్ కారులో ఇద్దరు పెద్దవాళ్లు ఒక చిన్న బిడ్డ కూర్చోవచ్చట. అయితే ఈ కంపెనీ ప్రకటించిన ధర మొదట 25వేల మంది వినియోగదారులకు మాత్రమే ఈ సంస్థ అందించబోతుందట. ఆ తర్వాత పెరగవచ్చని తెలిపారు. మందస్తు బుకింగ్ కి కేవలం 5000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందట. ఈ కారు వచ్చే ఏడాది డెలివరీలు ప్రారంభించబోతున్నారట. అలాగే బ్యాటరీ మూడు సంవత్సరాల వరకు ఉచిత వాహన కనెక్టివిటీ వంటి సదుపాయాలను కూడా ఉంచబోతున్నారట.
సౌర శక్తితో నడిచే ఈ కారు టాప్ పై సోలార్ ప్యానల్ కూడా ఉంటుందట. ఎండలో లేదా ఎక్కడైనా అవుట్డోర్లో పార్కు చేస్తే పవర్ అందుకొని బ్యాటరీ చార్జీ అయ్యి రన్నింగ్ అవుతుందట.. ఇందులో మూడు వేరియంట్స్లో ఈ కారుని తయారు. టాప్ స్పీడ్ 70 కిలోమీటర్ల వరకు గంటకు వెళుతుందట. ఈ కార్ ఒకసారి చార్జింగ్ అయిందంటే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అంట. ఐదు సెకండ్లు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందట. ఏడాదికి 3000 km వరకు ఈ సోలార్ ప్యానల్ ని వాడుకోవచ్చు అని కంపెనీ తెలిపింది. వేవ్ సంస్థ తెలిపిన సమాచారం మేరకు కిలోమీటర్ కి 50 పైసలు మాత్రమే ఖర్చవుతుందట.
ఈ కారుల అధునాతన ఫీచర్స్తోపాటు లిక్విడ్ బ్యాటరీ కూలింగ్, స్పీడ్ సెన్నింగ్ డోర్ లాక్ , లాప్టాప్ చార్జర్, పనోరమిక్ గ్లాస్ రూప్ ఇతరత్రా ఫీచర్స్ ఉన్నాయట.