భారతదేశ టెలికాం రంగంలో రిలయన్స్ జియో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఎయిర్‌టెల్, విఐ, bsnl వంటి పోటీదారులను వెనక్కి నెట్టి, అత్యధిక కస్టమర్లను కలిగి ఉన్న సంస్థగా నిలిచింది. కస్టమర్ల పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని, జియో ఎన్నో రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అయితే, ఇన్ని రకాల ఆప్షన్లు ఉండడంతో చాలామందికి ఏది ఎంచుకోవాలో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో, జియో తాజాగా ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఎయిర్‌టెల్, bsnl వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

కొన్ని నెలల క్రితం జియో తన రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, కొన్ని ప్లాన్లను నిలిపివేసింది. దీనితో ఎక్కువ వ్యాలిడిటీ ప్లాన్లకు డిమాండ్ పెరిగింది. వినియోగదారుల అవసరాలను గుర్తించిన జియో, ఆకర్షణీయమైన లాంగ్ టర్మ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అందులో 72 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ప్లాన్ ఒకటి. ఇప్పుడు జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ వివరాలు చూద్దాం.

జియో ఇప్పుడు రూ.749లకే రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అంటే లోకల్, STD కాల్స్ ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా చేసుకోవచ్చు. ఇది 72 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు, రోజుకు 100 SMS కూడా ఉచితంగా పొందవచ్చు. ఇంటర్నెట్ వాడే వారికోసం రోజుకు 2GB డేటాను అందిస్తోంది. అంటే మొత్తం వ్యాలిడిటీలో 144GB డేటా వస్తుంది. అంతేకాదు, మరో 20GB డేటాను కూడా జియో ఉచితంగా అందిస్తోంది. దీంతో ఈ ప్లాన్ నిజంగా వ్యాల్యూ ఫర్ మనీ ప్లాన్‌గా చెప్పుకోవచ్చు.

ఈ ప్లాన్‌లో జియో ట్రూ 5g యాక్సెస్ లభిస్తుంది. అంటే, 5g నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లోని యూజర్లు అన్‌లిమిటెడ్ 5g డేటాను వాడుకోవచ్చు. ఎక్కువ ఇంటర్నెట్ డేటా అవసరమయ్యే జియో యూజర్లకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ ప్లాన్ చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిపోయింది.

ఇవే కాకుండా, ఈ ప్లాన్‌లో సినిమాలు, షోల కోసం జియో సినిమాను ఉచితంగా చూడొచ్చు. లైవ్ టీవీ ఛానెళ్ల కోసం జియో టీవీ యాప్‌ను వాడుకోవచ్చు. అలాగే, ఫైళ్లను ఆన్‌లైన్‌లో భద్రపరుచుకోవడానికి జియో క్లౌడ్ సదుపాయం కూడా లభిస్తుంది. ఈ ఫీచర్లన్నీ కలిసి ఈ ప్లాన్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: