నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ ఫోన్ తో గడపకుండా ప్రజలు ఉండలేకపోతున్నారు. అయితే, వాటి బ్యాటరీల విషయంలో చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. మరి ఆ తప్పులేవో చూద్దాం.

చాలామంది చేసే మొదటి తప్పు రాత్రంతా ఛార్జింగ్ పెట్టి పడుకోవడం. రాత్రి పడుకునే ముందు ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి, ఉదయం తీస్తారు. ఫోన్ 100% ఛార్జ్ అయినా కూడా అలాగే పెట్టి ఉంచుతారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేస్తే ఫోన్ బ్యాటరీ తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. ఫోన్ 80% ఛార్జ్ అవ్వగానే తీసేయడం ఉత్తమం.

రెండో తప్పు 100% ఛార్జ్ అయ్యే వరకు వెయిట్ చేయడం. చాలామంది తమ ఫోన్ 100% ఛార్జ్ అయ్యే వరకు ఆపుతారు. కానీ, బ్యాటరీ నిపుణులు చెప్పేది ఏంటంటే, ఫోన్‌ను 80% ఛార్జ్ చేస్తే సరిపోతుంది. 100% వరకు ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది.

మూడో తప్పు బ్యాటరీ 0% అయ్యే వరకు వాడటం. చాలా మంది చేసే మరో తప్పు ఏంటంటే ఫోన్ బ్యాటరీ పూర్తిగా అయిపోయే వరకు వాడటం. ఫోన్ బ్యాటరీ 0%కి పడిపోయే వరకు వాడటం కూడా మంచిది కాదు. బ్యాటరీ 20% కి చేరగానే ఛార్జ్ చేయడం ఉత్తమం.

గుర్తుంచుకోవాల్సిన మరిన్ని ముఖ్య విషయాలు ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో పెట్టకూడదు. 80% ఛార్జ్ అవ్వగానే ఫోన్ తీసేయాలి. బ్యాటరీ 20% కన్నా తక్కువ అవ్వకముందే ఛార్జ్ చేయాలి.

ఫోన్ ఛార్జింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే, మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ఇవి స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ విషయంలో మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. వీటిని పాటిస్తే మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేస్తుంది, అంతేకాదు మీ ఫోన్ కూడా స్లో అవ్వకుండా చాలా బాగా నడుస్తుంది దీనివల్ల కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం ఉండదు ఫలితంగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: