మనం సెల్ఫోన్ మాట్లాడాలి అంటే మనకు సిగ్నల్స్ అనేవి చాలా ముఖ్యం. అలాగే సెల్ఫోన్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయాలి అన్న సిగ్నల్స్ చాలా అవసరం. సిగ్నల్స్ రావాలి అంటే మనకు టవర్స్ ముఖ్యం. టవర్స్ మనకు దగ్గరగా ఉన్నట్లు అయితే సిగ్నల్స్ ఎక్కువగా వస్తాయి. అలా సిగ్నల్స్ ఎక్కువ రావడం వల్ల సెల్ ఫోన్ మాట్లాడడంలో పెద్దగా అంతరాయాలు ఏర్పడవు. అలాగే ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడంలో కూడా పెద్దగా అంతరాయాలు రావు. అదే మన దగ్గర పరిసర ప్రాంతాల్లో సెల్ఫోన్ టవర్స్ లేనట్లయితే మనకు సిగ్నల్స్ రావు.

దాని ద్వారా సెల్ఫోన్ మాట్లాడడానికి కానీ , ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి కానీ అనేక కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే విపత్తుల సమయంలో కూడా సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడం ద్వారా సెల్ ఫోన్స్ పని చేయక ఇతరులతో కమ్యూనికేషన్ కోల్పోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అడవుల్లో , సముద్రాల్లో , మనుషులు నివసించని ప్రాంతాల్లో సెల్ఫోన్ కంపెనీస్ టవర్స్ ను నిర్మించవు.  దాని ద్వారా అలాంటి ప్రాంతాల్లోకి ఎవరైనా వెళ్ళినట్లయితే అక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్  లేకపోవడం వల్ల ఇతర ప్రజలతో కమ్యూనికేషన్ చేసే వీలు ఉండదు. ఇలాంటి ఆసౌకార్యాలను తీర్చడానికే ఎయిర్టెల్ సంస్థ ముందుకు రాబోతుంది. ఇక సెల్ఫోన్ టవర్స్ తో పని లేకుండా ఏకంగా సాటిలైట్ ద్వారానే ప్రతి ఒక్క సెల్ ఫోన్ కి సిగ్నల్స్ ను అందించే వసతులను మరికొంత కాలంలోనే భారత్ లో ఉన్న ఎయిర్టెల్ కస్టమర్లకు అందించబోతున్నట్లు ఎయిర్టెల్ సంస్థ తాజాగా ప్రకటించింది.

ఇకపోతే నిజం గానే ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రజలకు సిగ్నల్స్ బాధలు ఉండవు. ఎలాంటి సమయంలో నైనా ఎక్కడి నుండైనా ఇతరులతో కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు జనాలకు ఉంటాయి. మరి ఎయిర్టెల్ ఈ సదుపాయాలను ఎంత కాలంలో ముందుకు తీసుకువస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: